ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైహర్ జిల్లాలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించారు.

By అంజి  Published on  29 Sept 2024 7:36 AM IST
Six killed, bus rams truck, Madhya Pradesh

ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైహర్ జిల్లాలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించారు. దాదాపు 20 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదన్ దేహత్ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో బస్సు ప్రయాగ్‌రాజ్ నుండి నాగ్‌పూర్‌కు వెళుతుండగా ఆగి ఉన్న రాయితో కూడిన డంపర్ ట్రక్కును ఢీకొట్టిందని వారు తెలిపారు.

గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిని సత్నాకు తరలించామని మైహర్ పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ అగర్వాల్ పిటిఐకి తెలిపారు.

మిగిలిన వారు మైహార్‌, అమర్‌పతన్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అగర్వాల్ తెలిపారు.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story