విద్యార్థులకు ‘మెసేజ్’ పంపిన మనీష్ సిసోడియా..!

Sisodia's message for Delhi students from jail. లిక్కర్ పాలసీ స్కామ్‌లో ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా

By Medi Samrat  Published on  19 March 2023 3:45 PM GMT
విద్యార్థులకు ‘మెసేజ్’ పంపిన మనీష్ సిసోడియా..!

Manish Sisodia


లిక్కర్ పాలసీ స్కామ్‌లో ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా దేశ రాజధానిలోని విద్యార్థులకు ఓ ‘మెసేజ్’ పంపారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. “నేను బాగానే ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నా బాగుంటాను, నా గురించి చింతించాల్సిన అవసరం లేదు. మీ చదువుపై శ్రద్ధ పెట్టండి” అని కేజ్రీవాల్ తన మాజీ ఉప ముఖ్యమంత్రిని ఉటంకిస్తూ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి విద్యార్థులకు సిసోడియా సందేశాన్ని చదివి వినిపించారు.

“ఈరోజు మనతో ఇక్కడ మనీష్ జీ లేరు. కొన్ని రోజుల క్రితం, కొంతమంది విద్యార్థులు నా వద్దకు వెళ్లి, వారు ఆయన్ను మిస్ అవుతున్నట్లు చెప్పారు. టీచర్లతో సహా అందరూ మిస్ అవుతున్నారు. మనీష్ సిసోడియాను తప్పుడు కేసుల కింద అరెస్టు చేశారని పిల్లలు కూడా చెప్పారు. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని నేను బదులిచ్చాను" అని కేజ్రీవాల్ అన్నారు. మనీష్ సిసోడియా జైలు లోపల ఉన్నా కూడా మీ విద్య, ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నాడు. మీరు బాగా రాణించాలి. దేవుడు ఆయనకు పరీక్ష పెట్టాడు.. 100% మార్కులతో బయటకు వస్తాడు, మీ అందరితో ఉంటాడని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గత నెలలో అరెస్టు చేసింది.


Next Story
Share it