మహిళ నగ్న శరీరాన్ని చూడటం డిఫాల్ట్‌గా లైంగికమైనది కాదు: హైకోర్టు

మహిళ యొక్క నగ్న శరీరాన్ని చూడటం డిఫాల్ట్‌గా లైంగికంగా భావించకూడదు. అలాగే స్త్రీ యొక్క నగ్న శరీరం చిత్రణ అశ్లీలమైనది, అసభ్య

By అంజి  Published on  6 Jun 2023 8:00 AM IST
Kerala High Court, National news

మహిళ నగ్న శరీరాన్ని చూడటం డిఫాల్ట్‌గా లైంగికమైనది కాదు: హైకోర్టు

మహిళ యొక్క నగ్న శరీరాన్ని చూడటం డిఫాల్ట్‌గా లైంగికమైనది కాదు అని కేరళ హైకోర్టు పేర్కొంది. ''మహిళ యొక్క నగ్న శరీరాన్ని చూడటం డిఫాల్ట్‌గా లైంగికంగా భావించకూడదు. అలాగే స్త్రీ యొక్క నగ్న శరీరం చిత్రణ అశ్లీలమైనది, అసభ్యకరమైనది లేదా లైంగికంగా అసభ్యకరమైనదిగా పేర్కొనబడదు. సందర్భానుసారంగా మాత్రమే అలా నిర్ణయించబడవచ్చు" అని హైకోర్టు వ్యాఖ్యానించింది. తన పిల్లలతో తన నగ్నదేహంపై పెయింటింగ్‌ వేయించుకున్న కేసు నుంచి ఓ మహిళకు విముక్తి కల్పిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కేరళ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా తన దేహాన్ని పిల్లలకు కాన్వాస్‌గా ఉపయోగించిందే తప్ప లైంగిక ఉద్రేకాలను తృప్తి పరుచుకోవడానికి తన పిల్లలను ఉపయోగించుకున్నట్టు భావంచకూడదని కోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఫాతిమా నెట్టింట షేర్ చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. ఆ వీడియోలో ఫాతిమా తన శరీరం పైభాగంపై ఎటువంటి దుస్తులు లేకుండా మంచంపై పడుకుని ఉండగా ఆమె కుమార్తె, కుమారుడు ఫాతిమా ఒంటిపై పెయింటింగ్ వేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఫాతిమాపై పోక్సో చట్టం, జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ కేసుల నుంచి విముక్తి కల్పించాలంటూ ఫాతిమా తొలుత ట్రయల్ కోర్టును ఆశ్రయించగా.. అంగీకరించలేదు. దీంతో ఆమె హైకోర్టులో అప్పీలు చేసుకుంది.

ఈ క్రమంలోనే హైకోర్టులో ఫాతిమాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. స్త్రీ, పురుష శరీరాల విషయంలో సమాజంలోని ద్వంద్వ ప్రమాణాల గురించి తీర్పు పరిశీలనలు చేసింది. నగ్న శరీరాలను మామూలుగా చూసేందుకు వీలుగా పిల్లలు తన శరీరాన్ని కాన్వాస్‌గా చిత్రించుకునేందుకు తల్లి అనుమతిస్తే తప్పేమీ లేదని కోర్టు అభిప్రాయపడింది. స్త్రీ శరీరాల గురించి, తన పిల్లల లైంగిక విద్య కోసం పితృస్వామ్య భావనలను సవాలు చేసేందుకే తాను వీడియో తీశానని తల్లి వివరణను కూడా కోర్టు సమర్థించింది. వీడియోను అశ్లీలంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. మహిళలకు తమ శరీరాలపైనే హక్కులేకుండా పోతోందని, ఈ విషయంలో వారికి ఎలాంటి నిర్ణయమైనా స్వతంత్రంగా తీసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఇది వారికి రాజ్యంగంలోని 21వ అధీకరణ ద్వారా సంక్రమించిన హక్కు అని తెలిపారు.

న్యాయస్థానం ఇంకా ఇలా వ్యాఖ్యానించింది.. “నగ్నత్వాన్ని తప్పనిసరిగా అశ్లీలంగా లేదా అసభ్యకరంగా లేదా అనైతికంగా వర్గీకరించడం తప్పు. కొన్ని నిమ్న కులాల మహిళలు తమ రొమ్ములను కప్పుకునే హక్కు కోసం ఒకప్పుడు పోరాడిన రాష్ట్రం ఇది. దేశవ్యాప్తంగా ఉన్న పురాతన దేవాలయాలలో కుడ్యచిత్రాలు, విగ్రహాలు మరియు దేవతల కళలు సెమీ న్యూడ్‌లో ప్రదర్శించబడతాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా లభించే ఇటువంటి నగ్న శిల్పాలు మరియు పెయింటింగ్‌లను కళగా, పవిత్రంగా కూడా పరిగణిస్తారు. అన్ని దేవతల విగ్రహాలు వట్టి ఛాతీతో ఉన్నప్పటికీ, ఆలయంలో ప్రార్థించినప్పుడు, లింగభేదం కాదు, దైవత్వం అనే భావన కలుగుతుంది.

Next Story