నా బండి ముట్టుకోవద్దు అంటూ అరిచిన యువతి.. కొట్టిన ఎస్ఐ.. వీడియో వైరల్
SI slap girl for arguing in Karnataka.ఓ యువతిని మహిళా ఎస్ఐ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 10 March 2021 6:49 AM GMTఓ యువతిని మహిళా ఎస్ఐ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూటీపై వచ్చిన యువతి అక్కడి పోలీసుతో వాగ్వాదానికి దిగగా.. అక్కడే ఉన్న మహిళా ఎస్ఐ సహనం కోల్పోయి ఆయువతి చెంప చెళ్లుమనిపించింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మండ్య నగరంలో చోటు చేసుకుంది. నోరడి రోడ్డులో ఉన్న కూడలిపై మహిళా ఎస్ఔ కవితా గౌడ్ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్కూటీ రాంగ్ పార్కింగ్ చేసి ఉంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పోలీసులు స్కూటీని లాక్ చేసి పక్కన పెట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన యువతిని రికార్డులను చూపించాలని అడిగారు. నా వద్ద డబ్బులు లేవు, డబ్బులు గూగుల్ పేలో పంపిస్తాను, మీ నంబర్ ఇవ్వండి అని యువతి పోలీసులను అడిగింది.
అందుకు ఒప్పుకోని పోలీసులు మొదట బండి దిగు.. నీ పేరు, మీ నాన్న పేరు చెప్పు, మీ నాన్నను పోలీస్‌స్టేషన్‌కు పంపీ, అక్కడ బండిస్తాము అని చెప్పడంతో యువతి కోపంతో రగిలిపోయింది. నా బండి ముట్టుకోవద్దు అని గట్టిగా అరుస్తోంది. దాంతో పక్కనే ఉన్న ఎస్ఐ కవిత వచ్చి పోలీసులనే బెదిరిస్తావా? ఎంత ధైర్యం అంటూ ఆ యువతి చెళ్లుమనిపించింది. ఎస్ఐ చేసిన పనితో ఆ యువతి మరింత రెచ్చిపోయింది. నీవు ఎవరు కొట్టడానికి, నీకు ఏమీ హక్కులు ఉన్నాయి. ఎనే మాడ్తియా రాస్కెల్ అంటూ గోల గోల చేసింది. పోలీసులు స్కూటీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకుపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతిని ఎస్ఐ కొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యువతిని కొట్టే హక్కు ఎస్ఐకి లేదని వెంటనే సదరు ఎస్ఐని సస్పెండ్ చేయాలని నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.