అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో శ్రేయాస్ తల్పాడే

Shreyas Talpade To Play Former PM Atal Bihari Vajpayee in Kangana Ranaut's ‘Emergency'. కంగనా రనౌత్ నటిస్తున్న 'ఎమర్జెన్సీ' చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైన క్షణం

By Medi Samrat  Published on  27 July 2022 4:12 PM IST
అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో శ్రేయాస్ తల్పాడే

కంగనా రనౌత్ నటిస్తున్న 'ఎమర్జెన్సీ' చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైన క్షణం నుండి ప్రేక్షకులలో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రానికి కంగనానే దర్శకురాలిగా వ్యవహరిస్తూ ఉండడమే కాకుండా.. ఇందిరా గాంధీ రోల్ చేస్తోంది. ఫస్ట్ లుక్ లో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పోలి ఉండటంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో విప్లవ నాయకుడు జెపి నారాయణ్ పాత్రలో నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. తాజాగా దివంగత రాజకీయ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో నటుడు శ్రేయాస్ తల్పాడే నటించనున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

"Presenting @shreyastalpade27 as Bharat Ratna Atal Bihari Vajpayee in #Emergency, a true nationalist whose love and pride for the nation was unparalleled and who was a young upcoming leader during the time of Emergency…." అంటూ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

చిత్ర తారాగణంలో గురించి కంగనా రనౌత్ మాట్లాడుతూ, "శ్రీమతి గాంధీ మొదటి సారి ప్రధాని అయినప్పుడు.. యువ నాయకుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్న పాత్రలో అతను నటించాడు. ఎమర్జెన్సీని ఎదుర్కొన్న వారిలో ఆయన ఒకరు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రేయాస్ తల్పాడే ఈ సినిమాలో ఉండడం మా అదృష్టం. అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో ఆయన నటన మరపురానిదిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంతటి ముఖ్యమైన పాత్రలో నటించేందుకు శ్రేయాస్ తల్పాడే లాంటి పవర్ ఫుల్ పెర్ఫార్మర్ లభించడం మా అదృష్టం." అని చెప్పుకొచ్చింది.














Next Story