అమృత్‌సర్‌లోని పంజాబీ గాయకుడు ప్రేమ్ ధిల్లాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపారు. జైపాల్ భుల్లర్ ముఠా ఈ దాడికి బాధ్యత వహించింది. 2022లో చనిపోయిన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు ప్రేమ్ ధిల్లాన్ ద్రోహం చేశాడని భుల్లర్ ముఠా ఆరోపించింది. ధిల్లాన్ మొదట్లో మూసేవాలాకు మద్దతు ఇచ్చారని, ఇప్పుడు జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియాతో చేతులు కలిపి సిద్ధూకు వ్యతిరేకంగా మారాడని ఆరోపించారు.
భగవాన్‌పురియాతో ధిల్లాన్ కలిసి ఉండడాన్ని సహించేది లేదని సోషల్ మీడియా పోస్టులో భుల్లర్ ముఠా హెచ్చరించింది. ఈ దాడి ఆఖరి అవకాశం అంటూ హెచ్చరించారు. ఇప్పుడు కూడా నువ్వు మారకుంటే నువ్వు ఎక్కడికి పారిపోయినా నిన్ను ఎవరూ రక్షించలేరని బెదిరించారు. 'బూట్ కట్', 'ఓల్డ్ స్కూల్', 'మఝా బ్లాక్' వంటి హిట్ పాటలకు పేరుగాంచిన ప్రేమ్ ధిల్లాన్ ఈ దాడిపై లేదా ఆరోపణలపై ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు.
గత ఏడాది సెప్టెంబర్‌లో, కెనడాలోని వాంకోవర్‌లోని విక్టోరియా ద్వీపంలో గాయకుడు AP ధిల్లాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆ దాడికి బాధ్యత వహించింది.