దారుణం.. ఉడుముపై సామూహిక అత్యాచారం..!

Shocking incident in Maharashtra 4 Arrested.కామా తురానాం న భయం న లజ్జ అంటారు. అంటే.. కామంతో కళ్లు మూసుకుపోయిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2022 7:21 AM GMT
దారుణం.. ఉడుముపై సామూహిక అత్యాచారం..!

కామా తురానాం న భయం న లజ్జ అంటారు. అంటే.. కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి ఎటువంటి భయమూ, తప్పు చేస్తున్నాము అన్న భావ‌న‌, సిగ్గు కూడా ఉండ‌ద‌ని దీని అర్థం. ఇటీవల కాలంలో కొంద‌రు జంతువుల‌ను కూడా వ‌దిలిపెట్ట‌డం లేదు. తాజాగా అత్యంత జుగుప్సాకరంగా అనిపించే ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వ‌చ్చింది. న‌లుగురు వ్య‌క్తులు బెంగాల్ మానిటర్ బల్లి(ఉడుము) పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళితే.. మహారాష్ట్ర కొల్హాపూర్ సహ్యాద్రి టైగర్ ప్రాజెక్టు పరిధిలో కొందరు వేటగాళ్లు తుపాకీలతో తిరుగుతున్నారన్న స‌మాచారం అంద‌డంతో అట‌వీశాఖ అధికారులు సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా న‌లుగురు నిందితుల‌ను వ‌ల‌న్ని ప‌ట్టుకున్నారు. వీరిని సందీప్ తుక్రామ్, పవార్ మంగేష్, జనార్దన్ కామ్టేకర్, అక్షయ్ సునీల్ లుగా గుర్తించారు. కొంకణ్ నుంచి కొల్హాపూర్ చందోలి గ్రామానికి వేట‌కు వచ్చిన‌ట్లు విచార‌ణ‌లో తెలిసింది.

తొలుత వీరిని వేట‌గాళ్లుగా బావించారు అధికారులు. అయితే.. వీరి వ‌ద్ద ఉన్న సెల్‌ఫోన్ల‌ను ప‌రిశీలించ‌గా.. పోలీసులే షాక్ తిన్నారు. టైగర్ రిజర్వాయర్ లోకి ప్రవేశించిన ఈ నలుగురు వ్యక్తులు బెంగాల్ మానిటర్ బల్లి(ఉడుము) పై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వీడియోల్లో క‌నిపించింది. వెంట‌నే వీరిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజ‌రు ప‌రిచారు. వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం 1972 ప్ర‌కారం.. నేరం రుజువైతే ఈ న‌లుగురికి ఏడేళ్ల జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది.

Next Story