భారీ అగ్నిప్రమాదం.. శివుడి ఆలయం దగ్ధం

టూరిస్ట్ రిసార్ట్‌లోని కొండపై ఉన్న శివుడి ఆలయం బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదంలో దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.

By అంజి  Published on  5 Jun 2024 10:34 AM IST
Shiv Temple, fire, Jammu and Kashmir,  Rani Temple,Gulmarg

అగ్నిప్రమాదం.. శివుడి ఆలయం దగ్ధం

జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లోని టూరిస్ట్ రిసార్ట్‌లోని కొండపై ఉన్న ఒక ఆలయం బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదంలో దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. చారిత్రాత్మకంగా మహారాణి ఆలయం అని కూడా పిలువబడే శివాలయంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. స్థానికుల సహకారంతో పోలీసులు మంటలను ఆర్పినప్పటికీ ఆలయాన్ని కాపాడలేకపోయారని వారు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. "ఆప్ కి కసమ్"లోని హిట్ పాట 'జై జై శివ్ శంకర్'తో సహా పలు బాలీవుడ్ సినిమాల్లో ఈ ఆలయం కనిపించినందున ఇది పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మంటల్లో చిక్కుకున్న రాణి కా టెంపుల్ లేదా మోహినేశ్వర్ శివాలయ అని కూడా ప్రసిద్ధి చెందిన ఆలయ చిత్రాలతో సోషల్ మీడియా నిండిపోయింది. మహారాణి ఆలయాన్ని 1915లో మహారాజా హరి సింగ్ భార్య మోహినీ బాయి సిసోడియా నిర్మించారు. ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్‌లోని డోగ్రా రాజులకు చెందినది. ఇది ధర్మార్థ్ ట్రస్ట్ నియంత్రణలో ఉన్న దేవాలయాలలో ఒకటి. ఇది పూర్వపు రాజకుటుంబంచే నిర్వహించబడుతుంది. గుల్‌మార్గ్ మధ్యలో ఉన్న మహారాణి ఆలయం.. వివిధ మతాలు ఎలా కలిసి ఉండవచ్చేనేదానికి ఒక ఉదాహరణ, ఒక ముస్లిం పూజారి ఇక్కడ పూజలు నిర్వహించడం.

Next Story