విదేశీ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే హఠాన్మరణం

Shiv Sena MLA Ramesh Latke dies of cardiac arrest in Dubai.శివసేన పార్టీ నాయకుడు,అంథేరీ ఈస్ట్ ఎమ్మెల్యే రమేష్​

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 May 2022 3:03 PM IST
విదేశీ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే హఠాన్మరణం

శివసేన పార్టీ నాయకుడు,అంథేరీ ఈస్ట్ ఎమ్మెల్యే రమేష్​ లట్కే గుండెపోటుతో మ‌ర‌ణించారు. త‌న స్నేహితుడిని క‌లిసేందుకు కుటుంబంతో క‌లిసి దుబాయ్ వెళ్లిన ఆయ‌న బుధ‌వారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆయ‌న వ‌యస్సు 52 సంవ‌త్స‌రాలు. ఆయ‌న భౌతిక కాయాన్ని వీలైన తొంద‌ర‌గా దుబాయ్ నుంచి భార‌త్‌కు ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్​ పరబ్​ తెలిపారు.

ముంబైలోని అంధేరి ఈస్ట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రమేష్​ లట్కే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే కావ‌డానికి ముందు ఆయ‌న బీఎంసీ కార్పొరేట‌ర్‌గా కూడా చేశారు. ఎమ్మెల్యే ర‌మేశ్ మృతి ప‌ట్ల పార్టీలకతీతంగా నివాళులు అర్పిస్తున్నారు నేతలు. క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఆయ‌న చేసిన సేవ‌ల్ని గుర్తుచేసుకుంటున్నారు.

శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే ఆకస్మిక మరణ వార్త విని షాక్ అయ్యా. కొన్ని నెలల క్రితం అంగ్నేవాడి జాతర కోసం కోకన్‌కి విమానంలో వెళ్తున్నప్పుడు ఆయనను కలిసిన విషయం నాకు గుర్తుంది. డైటింగ్ వల్ల చాలా బరువు తగ్గాడని నేను అతనిని మెచ్చుకున్నాను. అతను పార్టీకి అతీతంగా స్నేహితుడు అని బీజేపీ నేత నితేష్ రానే ట్వీట్ చేశాడు.

ఎమ్మెల్యే ర‌మేశ్ మృతి ప‌ట్ల ఎంపీ ప్రియాంకా చ‌తుర్వేది నివాళి అర్పించారు. క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఆయ‌న చేసిన సేవ‌ల్ని ఎంపీ గుర్తు చేసుకున్నారు.

Next Story