వెన్నుపోటు పొడిచారంటున్న సంజయ్
Shiv Sena is not born for power Power is born for Shiv Sena says Sanjay Raut.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2022 3:16 PM ISTమహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రాజీనామా లేఖను గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆమోదించారు. ఉద్ధవ్ బుధవారం రాత్రి రాజీనామా చేయడంతో గురువారం బలపరీక్ష కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనుకున్న అసెంబ్లీ సమావేశం రద్దైంది. బలపరీక్ష అవసరం లేని కారణంగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోమని రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. దీనిపై బిజెపి సమావేశమైంది. రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాలపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తాను ముఖ్యమంత్రిగా కొనసాగడం సరైనది కాదని ఉద్ధవ్ తన పదవికి రాజీనామా చేశారని, ఆయన చాలా నైతిక విలువలున్న నేత అని ప్రశంసించారు. ఉద్ధవ్ రాజీనామా చేసినప్పుడు తామంతా ఉద్వేగానికి లోనయ్యామని, ఉద్ధవ్‌పై తమకు విశ్వాసం ఉందని అన్నారు. సోనియా, శరద్ పవార్ ఆయనపై నమ్మకం ఉంచారన్నారు. శివసేన అధికారం కోసం పుట్టలేదని, అధికారమే శివసేన కోసం పుట్టిందన్నారు. బాలా సాహెబ్ ఎల్లప్పుడూ చెప్పే మంత్రం ఇదేనన్నారు. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, మా సత్తాతోనే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రౌత్ అన్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచారంటూ ఓ చిత్రాన్ని సంజయ్ రౌత్ ట్విటర్‌లో షేర్ చేస్తూ.. 'ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరిగింది' అని చెప్పుకొచ్చారు.
नेमके हेच घडले! pic.twitter.com/nNkBXNAzB3
— Sanjay Raut (@rautsanjay61) June 30, 2022