AI ఎఫెక్ట్..జాబ్ కోల్పోయిన శశిథరూర్‌ కుమారుడు

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ ఉద్యోగాన్ని కోల్పోయారు

By -  Knakam Karthik
Published on : 5 Feb 2026 10:40 AM IST

National News, Shashi Tharoor, Ishaan, Washington Post, job cuts

AI ఎఫెక్ట్..జాబ్ కోల్పోయిన శశిథరూర్‌ కుమారుడు

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ ఉద్యోగాన్ని కోల్పోయారు. ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ పత్రిక చేపట్టిన లే ఆఫ్ ప్రక్రియలో ఆయన పేరు కూడా చేరింది. ఖర్చులు తగ్గించుకునే లక్ష్యంతో సంస్థ చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో సుమారు మూడో వంతు సిబ్బందిని తొలగించింది. ఈ నేపథ్యంలో సీనియర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కాలమిస్ట్‌గా పనిచేస్తున్న ఇషాన్ థరూర్ కూడా ఉద్యోగం కోల్పోయారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు.

వాషింగ్టన్ పోస్ట్‌లో జరిగిన లేఆఫ్‌లలో తనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల విభాగానికి చెందిన పలువురు ఉద్యోగాలు కోల్పోయారని ఇషాన్ తెలిపారు. గత 12 ఏళ్లుగా తాను అదే సంస్థలో పని చేస్తున్నానని, ఈ ప్రయాణంలో ఎంతో ప్రతిభావంతమైన, అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని గుర్తు చేసుకున్నారు. తాజా పరిణామం తనను తీవ్రంగా కలిచివేసిందని కూడా ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

Next Story