కాంగ్రెస్ ఎంపీ వినూత్న నిర‌స‌న‌.. ఆటోరిక్షాను తాడుతో లాగుతూ..

Shashi Tharoor pulls autorickshaw with rope to protest soaring fuel prices

By Medi Samrat  Published on  26 Feb 2021 9:02 PM IST
కాంగ్రెస్ ఎంపీ వినూత్న నిర‌స‌న‌.. ఆటోరిక్షాను తాడుతో లాగుతూ..

పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు, నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ధ‌ర‌ల సెంపు ప‌ట్ల వినూత్న రీతిలో త‌మ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. సెంచ‌రీ దాటిందంటూ క్రికెట‌ర్ల ఫోటోల‌కు మోదీ, అమిత్ షాల త‌ల‌ల‌ను జ‌త‌చేసి సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు వేస్తున్నారు. ఇక నాయ‌కులు ఆటోల‌కు, కార్ల‌కు తాడు క‌ట్టి లాగుతూ కేంద్ర ప్ర‌భుత్వంపై త‌మ నిర‌స‌న‌ను తెలుపుతున్నారు.

తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలను నిరసిస్తూ తిరువనంతపురంలో శశి థరూర్ ఆటోరిక్షాను తాడుతో లాగుతూ తన నిరసనను వ్యక్తం చేశారు. ఇంధన పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించడంలో విఫలమైనందుకు నిరసన తెలుపుతున్నాయని థరూర్ అన్నారు. సెంచ‌రీకి ద‌గ్గ‌రైన వేళ..‌ దేశం వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుండి వ్య‌తిరేక‌త వ‌స్తున్న త‌రుణంలో కేంద్రం ధ‌ర‌ల‌పై ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌ని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. ‌


Next Story