విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు.. ముగ్గురు మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న మ‌రో 15 మంది..!

Several feared dead after landslide in Haryana.హర్యానా రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. భివానీ జిల్లాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jan 2022 10:01 AM GMT
విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు.. ముగ్గురు మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న మ‌రో 15 మంది..!

హర్యానా రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. భివానీ జిల్లాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ముగ్గురు మృతి చెంద‌గా.. మ‌రో 15 నుంచి 20 మంది గ‌ల్లంతైయ్యారు. దాడ‌మ్ మైనింగ్ జోన్‌లో క్వారీ ప‌నులు జ‌రుగుతుండ‌గా ఓ కొండ‌కు ప‌గుళ్లు ఏర్ప‌డి పెద్ద పెద్ద బండ‌రాళ్లు కింద‌ప‌డ్డాయి. కొన్ని రాళ్లు కూలీలు ప‌ని చేస్తున్న చోట, వాహానాల‌పై ప‌డ్డాయి. దీంతో అక్క‌డ ప‌ని చేస్తున్న కూలీలు కొండ‌చ‌రియ‌ల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంట‌నే రెస్క్యూ, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.

సహాయక చర్యలు చేప‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురి మృత‌దేహాల‌ను వెలికితీశారు. మ‌రో ముగ్గురిని కాపాడి ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా శిథిలాల కింద 15 నుంచి 20 మంది ఉన్న‌ట్లు చెబుతున్నారు. క్వారీ వ‌ద్ద ప‌దుల సంఖ్య‌లో క్రేన్లు, డంప‌రు వాహ‌నాలు ధ్వంస‌మ‌య్యాయి. కొన్ని యంత్రాలైతే నుజ్జునుజ్జు అయ్యాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జెపి దలాల్‌, ఎస్‌పి అజిత్‌ సింగ్‌ షెకావత్‌ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

కాగా.. ఈ ప్ర‌మాదంపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. 'దాడ‌మ్ మైనింగ్ జోన్‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న దుర‌దుష్ట‌క‌రం. ఘ‌ట‌నాస్థ‌లంలో స‌హాయక చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించాను.' అని సీఎం ట్వీట్ చేశారు.

Next Story