ఎంపీ మహేంద్రప్రసాద్‌ కన్నుమూత

Seven Term Rajya Sabha MP Mahendra Prasad Dies At 81.ప్రముఖ పారిశ్రామికవేత్త, జనతాదళ్‌ (యునైటెడ్‌)కు చెందిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Dec 2021 9:55 AM IST
ఎంపీ మహేంద్రప్రసాద్‌ కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, జనతాదళ్‌ (యునైటెడ్‌)కు చెందిన రాజ్యసభ సభ్యుడు మహేంద్రప్రసాద్ క‌న్నుమూశారు. గ‌త‌కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న.. ఆదివారం రాత్రి పరిస్థితి విష‌మించ‌డంతో ఢిల్లీలో తుదిశ్వాస విడిచారని జేడీయూ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆయ‌న వ‌య‌స్సు 81 సంవ‌త్స‌రాలు. మహేంద్ర బిహార్‌ నుంచి 7 పర్యాయాలు రాజ్యసభకు, ఒక విడత లోక్‌సభకు ఎన్నికయ్యారు.

అరిస్టో ఫార్మాస్యూటికల్స్‌ వ్యవస్థాపకుడైన మహేంద్రప్రసాద్‌కు పార్లమెంట్‌ సభ్యుల్లో అత్యంత ధనికుల్లో ఒకరిగా పేరుంది. 1980లో కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన చాలా కాలం పాటు పార్టీతో అనుబంధం కొనసాగించారు. అనంత‌రం ఆ పార్టీని వీడారు. ఆయన మృతి ప‌ట్ల‌ ప్రధాని మోదీ, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు స‌హా ప‌లువురు నేత‌లు సంతాపం తెలిపారు.

'రాజ్యసభ ఎంపీ డాక్టర్ మహేంద్ర ప్రసాద్ జీ మరణించడం బాధాకరం. అతను చాలా సంవత్సరాలు పార్లమెంటులో పనిచేశారు. అనేక సమాజ సేవా ప్రయత్నాలలో అగ్రగామిగా ఉన్నారు. అతను ఎల్లప్పుడూ బీహార్ మరియు ప్రజల సంక్షేమం కోసం పోరాడాడు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి"అని ప్ర‌ధాని ట్వీట్ చేశారు.

ఆయన మరణం పరిశ్రమతో పాటు సమాజానికి మరియు రాజకీయాలకు తీరని లోటని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు.

Next Story