కొనసాగుతున్న‌ స్టాక్ మార్కెట్ పతనం

విదేశీ నిధుల ఉపసంహరణ, ఇన్ఫోసిస్ షేర్ల విక్రయాల మధ్య శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ క్షీణించింది.

By Kalasani Durgapraveen  Published on  18 Oct 2024 5:42 AM GMT
కొనసాగుతున్న‌ స్టాక్ మార్కెట్ పతనం

విదేశీ నిధుల ఉపసంహరణ, ఇన్ఫోసిస్ షేర్ల విక్రయాల మధ్య శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ క్షీణించింది. మార్కెట్‌ వరుసగా నాలుగో రోజు క్షీణతలో కొనసాగుతోంది. ఇన్ఫోసిస్ రెండో త్రైమాసిక ఆదాయాలు ఇన్వెస్టర్లను మెప్పించడంలో విఫలమవడంతో షేర్లు అమ్మకాలకు గురయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 570.45 పాయింట్లు క్షీణించి 80,436.16కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 178.3 పాయింట్లు పతనమై 24,571.55 వద్దకు చేరుకుంది.

సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో టైటాన్, ఇన్ఫోసిస్, మారుతీ, నెస్లే, ఐటీసీ, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్‌లు అత్యంత వెనుకబడి ఉన్నాయి. భారతదేశపు రెండవ అతిపెద్ద ఐzw సేవల ఎగుమతిదారు ఇన్ఫోసిస్ లిమిటెడ్ గురువారం తన రెండవ త్రైమాసిక నికర లాభంలో దాదాపు 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. బ్లూచిప్ కంపెనీల్లో యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డాయి.

అంతకుముందు ప్రారంభ ట్రేడ్‌లో హెచ్చుతగ్గుల మధ్య నిఫ్టీ ఇండెక్స్ 0.34 శాతం లేదా 84 పాయింట్ల నష్టంతో 24,664.95 పాయింట్ల వద్ద ప్రారంభమైంది, అయితే బిఎస్‌ఇ సెన్సెక్స్ ఇండెక్స్ 257 పాయింట్లు లేదా 0.32 శాతం క్షీణించి 80,749.26 వద్ద ప్రారంభమైంది.

Next Story