శబరిమలకు వెళ్లే వారికి శుభవార్త

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల వెళ్లే వారి కోసం రైల్వే శాఖ మరో 28 ప్రత్యేక రైళ్లు నడపనుంది.

By అంజి  Published on  6 Dec 2024 8:36 AM IST
SCR, train services, Sabarimala pilgrim, Kerala, Kachiguda, Kakinada

శబరిమలకు వెళ్లే వారికి శుభవార్త

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల వెళ్లే వారి కోసం రైల్వే శాఖ మరో 28 ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఇప్పటికే శబరిమలకు పలు రైళ్లను నడుపుతోన్న దక్షిణ మధ్య రైల్వే.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 28 రైళ్లు ఏర్పాటు చేసింది. డిసెంబర్‌ 11 నుంచి జనవరి 29 వరకు వివిధ తేదీల్లో నడిచే ఈ రైళ్లు మౌలాలి - కొల్లం, కాచిగూడ - కొట్టాయం, కాకినాడ - కొల్లం, నర్సాపూర్‌ - కొల్లం మధ్య ఇరువైపులా తిరగనున్నాయి. డిసెంబర్‌ 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ రైళ్ల రిజర్వేషన్‌ బుకింగ్‌ అందుబాటులోకి రానుంది.

డిసెంబర్ 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైలు (రైలు నెం. 07193) మౌలాలి నుంచి కొల్లం, కొల్లం నుంచి మౌలాలి వరకూ ప్రత్యేక సర్వీసు (రైలు నెం. 07194) డిసెంబర్ 13, 20, 27 తేదీల్లో నడపనున్నారు. డిసెంబర్ 14, 21, 28 తేదీల్లో ప్రత్యేక సర్వీసు (రైలు నెం 07149) మౌలాలి నుంచి కొల్లం వరకూ, డిసెంబర్ 16, 23, 30 తేదీల్లో (రైలు నెం. 07150) నడపనున్నారు.

జనవరి 2, 9, 16, 23 తేదీల్లో రైలు నెం. 07151 కాచిగూడ నుంచి కొట్టాయం వరకూ.. జనవరి 3, 10, 17, 24 వరకూ రైలు నెం 07152 కొట్టాయం నుంచి కాచిగూడ వరకూ రైలు నడవనుంది. జనవరి 6, 13 తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి రైలు నెం. 07155.. జనవరి 8, 15 తేదీల్లో రైలు నెం. 07156 వరకూ నడపనున్నారు. జనవరి 20, 27 తేదీల్లో నర్సాపూర్ నుంచి కొల్లం వరకూ రైలు నెం. 07157.. కొల్లం నుంచి నర్సాపూర్ వరకూ జనవరి 22, 29 తేదీల్లో రైలు నెం.07158 సర్వీస్ నడవనుంది.

Next Story