ఇన్ఫోసిస్ కో-ఫౌండర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయింది.
By Knakam Karthik
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయింది. ఆయనతో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) మాజీ డైరెక్టర్ బలరామ్‌తో సహా మరో 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు రిజిస్టర్ అయింది. 71వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు (సీసీహెచ్) ఆదేశాల మేరకు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.
గిరిజన బోవి కమ్యూనిటీకి చెందిన ఫిర్యాదుదారుడు దుర్గప్ప ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ మెంబర్‌గా కొనసాగుతున్నాడు. 2014లో తనను హనీ ట్రాప్ కేసులో తప్పుగా ఇరికించారని, అనంతరం తనను సర్వీసు నుంచి కూడా తొలగించారని అతడు ఆరోపించాడు. అదేవిధంగా తన కులాన్ని దూషిస్తూనే బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపాడు. దుర్గప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు మొత్తం 16 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర వ్యక్తులలో గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వర్, హరి కేవీఎస్, దాసప్ప, బలరామ్ పి, హేమలతా మిషి, ఛటోపాధ్యాయ. ప్రదీప్ డీ సావార్కర్, మనోహరన్ ఉన్నారు.