అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టును వివరణ కోరింది.విశ్వహిందూ పరిషత్ (VHP) కార్యక్రమంలో.. జస్టిస్ శేఖర్ యాదవ్ మెజారిటీ ప్రకారం దేశం నడుస్తుందని అన్నారు.
"అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి శేఖర్ కుమార్ యాదవ్ ప్రసంగాన్ని వార్తాపత్రికలలో ప్రచురించడంతో సుప్రీం కోర్టు ఈ అంశంపై దృష్టి సారించి.. హైకోర్టు నుండి వివరాలు కోరింది.. ఈ విషయం సబ్ జడ్జికి సంబంధించినది" అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
డిసెంబరు 8న అలహాబాద్ హైకోర్టులోని లైబ్రరీ హాలులో విశ్వహిందూ పరిషత్ లీగల్ సెల్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సామాజిక సామరస్యం, లింగ సమానత్వం, లౌకికవాదాన్ని పెంపొందించడమే యూనిఫాం సివిల్ కోడ్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ వాఖ్యలకు సబంధించి ఒక రోజు తర్వాత వీడియో బయటకుచ్చింది.
దేశం, రాజ్యాంగం ఒక్కటే అయినప్పుడు చట్టం ఎందుకు ఒకటి కాదని జస్టిస్ శేఖర్ యాదవ్ అన్నారు. జస్టిస్ యాదవ్ తన ప్రసంగంలో షాబానో కేసును కూడా ప్రస్తావించారు. ట్రిపుల్ తలాక్ తప్పు అని సుప్రీంకోర్టు అంగీకరించిందని అన్నారు. కానీ అప్పటి ప్రభుత్వంకు తలవంచాల్సి వచ్చిందన్నారు.