ఎన్ని ఎదురుదెబ్బలో..?

SC refuses to stay EC’s order for now, issues notice on Uddhav’s plea. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి వరుస గా గుడ్ న్యూస్ లు

By M.S.R  Published on  22 Feb 2023 6:45 PM IST
ఎన్ని ఎదురుదెబ్బలో..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి వరుస గా గుడ్ న్యూస్ లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని అధికారిక శివసేనగా గుర్తిస్తూ భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు వాళ్లకు గ్రేటెస్ట్ విక్టరీగా నిలవగా.. ఇప్పుడు వాటిని సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే వర్గం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బ్యాడ్ న్యూస్ చెప్పింది. విల్లు, బాణం గుర్తుతో ఏక్‌నాథ్ షిండే గ్రూపును శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గానికి పార్టీ పేరు, విల్లు, బాణం గుర్తును ఉపయోగించుకునేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉద్ధవ్ శిబిరానికి ఎదురుదెబ్బ తగిలింది. షిండే వర్గం EC ముందు వాదనల్లో విజయం సాధించిందని.. ఈ దశలో మేము ఆర్డర్‌పై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం షిండే శిబిరం ఈసీ వద్ద విజయం సాధించిన తరుణంలో స్టే విధించలేమంటూ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా లేని ఏదైనా చర్య తీసుకుంటే గనుక చట్టానికి సంబంధించిన ఇతర పరిష్కారాలను అనుసరించవచ్చని సుప్రీం కోర్టు థాక్రే శిబిరానికి సూచించింది.


Next Story