మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

SBI offers special concession to women borrowers. మహిళా దినోత్సవం సందర్బంగా హోమ్‌లోన్‌ తీసుకునే మహిళలకు వడ్డీరేటులో 5 బేసిక్‌ పాయింట్లను తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.

By Medi Samrat  Published on  8 March 2021 9:16 AM GMT
SBI offers special concession to women borrowers

సొంతింటి కల నెరవేర్చుకోవాలని అనుకుంటున్న వారికి ఇది శుభవార్తే. ముఖ్యంగా మగువలకు సొంతంగా ఇల్లు కలిగి ఉండాలని కోరుకుంటారు. అయితే వారికి మహిళా దినోత్సవం సందర్బంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గుడ్‌న్యూస్‌ అందించింది. హోమ్‌లోన్‌ తీసుకునే మహిళలకు వడ్డీరేటులో 5 బేసిక్‌ పాయింట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 6.70 శాతంగా నిర్ణయించింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

వీరికి ప్రయోజనం

కాగా, కొత్త హోమ్‌ లోన్‌ తీసుకునే వారికి ఈ తగ్గిన వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. ఇప్పటికే హోమ్‌లోన్‌ తీసుకున్న రుణగ్రహీతలకు వర్తించదు. కొన్ని బ్యాంకుల్లో ఎగ్జిస్టింగ్‌ కస్టమర్లకు వర్తిస్తుంది. ఆర్బీఐ రెపోరేటును త‌గ్గిస్తే మాత్రమే ప్ర‌స్తుత రుణగ్ర‌హీత‌లకు ప్రయోజనం ఉంటుంది. హోమ్ లోన్ రేట్ల‌ను బ్యాంకులు 2019 అక్టోబ‌ర్ 1 నుంచి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్‌తో అనుసంధానించాల‌ని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలు బ్యాంకులు రెపో రేట్ల‌ను బెంచ్‌ మార్కుగా ఎంచుకున్నాయి. రెపోరేటు ఆధారిత హోమ్ లోన్స్‌ను రెపో రేటు ప్ర‌కార‌మే లెక్కిస్తారు.

రెండు విధాల ప్రయోజనం

ఇంటి రుణం పైన వడ్డీ రేటు తగ్గడం వల్ల రుణగ్రహీతలకు రెండింతల ప్రయోజనం ఉంటుంది. వడ్డీ రేటు తగ్గడం వల్ల లోన్‌ భారం తగ్గుతుంది. అలాగే కస్టమర్లు మరింత రుణం తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. రుణ పరిమితి పెరిగి, ఎక్కువ మొత్తం తీసుకునే ప్రయోజనం ఉంటుంది. అలాగే ఎగ్జిస్టింగ్‌ రుణగ్రహీతలు కూడా త్వరగా లోన్‌ ముగించుకోవచ్చు.
Next Story
Share it