వాట్సాప్‌ ద్వారా ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సేవలు.. ఇలా చేస్తే చాలు.!

SBI Launches whatsapp banking services. ప్రముఖ మెసేంజర్ యాప్‌ వాట్సాప్‌.. తన సేవలను కస్టమర్లకు మరింత విస్తృతం చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫిచర్స్‌ను

By అంజి  Published on  24 July 2022 4:34 AM GMT
వాట్సాప్‌ ద్వారా ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సేవలు.. ఇలా చేస్తే చాలు.!

ప్రముఖ మెసేంజర్ యాప్‌ వాట్సాప్‌.. తన సేవలను కస్టమర్లకు మరింత విస్తృతం చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫిచర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. తెస్తోంది. భారత్‌లో వాట్సాప్‌ యూజర్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఈ లిస్ట్‌లోకి భారత్‌లోని అతిపెద్ద బ్యాంకింగ్‌.. భారతీయ స్టేట్ బ్యాంక్ వచ్చి చేరింది. వాట్సాప్‌ ఆధారంగా తన ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌ ద్వారా ఎస్బీఐ కస్టమర్లు మినీ స్టేట్‌మెంట్‌, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూసుకోవచ్చు. ''వాట్సాప్‌లో ఇప్పుడు మీ బ్యాంకు సేవ‌లు. మీరు మీ ఖాతాలో బ్యాలెన్స్‌, మినీ స్టేట్‌మెంట్ చూసుకోవ‌చ్చు' అని ఇటీవ‌ల ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఎస్‌బీఐ తెలిపింది.

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ఎస్బీఐ కస్టమర్‌ మొదట తప్పనిసరిగా పేరును రిజిస్టర్‌ చేసుకోవాలి. దీని కోసం ముందుగా 7208933148 నంబర్‌కు మెసేజ్‌ పంపాల్సి ఉంటుంది. ''WAREG అని రాసి స్పేస్‌ ఇచ్చి తర్వాత బ్యాంక్ అకౌంట్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి'' ఆ తర్వాత మెసేజ్‌ సెండ్‌ చేయాలి. ముఖ్యంగా మీ బ్యాంకు ఖాతాకు నమోదు చేసిన మొబైల్‌ నంబర్‌ నుంచి మాత్రమే మెసేజ్‌ పంపాలి. లేదంటే ఈ సర్వీసులను మీరు పొందలేరు. ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ రిజిస్ట్రేష‌న్ విజ‌య‌వంతం అయిన త‌ర్వాత ఎస్బీఐ 90226 90226 నంబ‌ర్ నుంచి మెసేజ్ వ‌స్తుంది. ఈ ఫోన్ నంబ‌ర్‌ను సేవ్ చేసుకోవాలి

వాట్సాప్ బ్యాంకింగ్ సేవ‌లు ఇలా..

90226 90226 నంబ‌ర్‌కు 'Hi SBI' అని మెసేజ్ పంపాలి. లేదా వాట్సాప్ నుంచి మీకు వ‌చ్చిన మెసేజ్‌కు రిప్లే ఇవ్వాలి. అప్పుడు ఈ క్రింది మెసేజ్ వ‌స్తుంది.

డియ‌ర్ క‌స్ట‌మ‌ర్‌.. ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవ‌ల‌కు స్వాగ‌తం!

కింద ఇచ్చిన ఆప్ష‌న్ల‌లో ఏదో ఒక‌టి ఎంపిక చేసుకొండి.

1. ఖాతా బ్యాలెన్స్‌

2. మినీ స్టేట్‌మెంట్‌

3. వాట్సాప్ బ్యాంకింగ్ నుంచి డీ-రిజిస్ట‌ర్.. అని చూపిస్తుంది.

ఎస్బీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవ‌ల వాడ‌కంపై మీ ఇష్టాయిష్టాల‌ను బ‌ట్టి ఆప్ష‌న్ ఎంచుకోవాలి. ప్రస్తుతం ఈ మూడు సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Next Story