జైలులో రాజ‌భోగాలు.. మంత్రికి మ‌సాజ్‌లు, వీఐపీ ట్రీట్‌మెంట్‌.. వీడియో వైర‌ల్‌

Satyendar Jain Caught On Cam Getting Massage In Tihar Jail.ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ కు సంబంధించిన వీడియోలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2022 1:51 PM IST
జైలులో రాజ‌భోగాలు.. మంత్రికి మ‌సాజ్‌లు, వీఐపీ ట్రీట్‌మెంట్‌.. వీడియో వైర‌ల్‌

మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్నాడు. అయితేనేం.. జైలులో రాజ‌భోగాలు అనుభ‌విస్తున్నారు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుడు, ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌. ఇందుకు సంబంధించిన వీడియోలు తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

తీహార్ జైలులో మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌కు ప్ర‌త్యేక సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నార‌ని, వీఐపీ ట్రీట్‌మెంట్ అందుతోంద‌ని ఈడీ కోర్టుకు తెలిపిన కొద్ది రోజుల‌కే మంత్రి మ‌సాజ్ చేయించుకుంటున్న వీడియో బ‌య‌ట‌కు రావ‌డం గ‌మ‌నార్హం. ఈ వీడియోలో ఓ వ్య‌క్తి జైన్ త‌ల‌కు, కాళ్ల‌కు మ‌సాజ్ చేస్తున్నారు. వీడియోను బ‌ట్టి ఇది సెప్టెంబ‌ర్ నెల‌లో జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిల్స్ ప్యాకెట్ కూడా ఉండ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఆయ‌న గ‌దిలో ప్ర‌త్యేక‌మైన స‌దుపాయాలు కూడా ఉన్నాయి. దీనిపై జైలు అధికారులు స్పందించాల్సి ఉంది.

మ‌నీలాండ‌రింగ్ కేసులో స‌త్యేంద్ర జైన్‌ను మే 30న అరెస్ట్ చేశారు. ఈ కేసులో సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించిన విష‌యం తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక జడ్జి జస్టిస్ వికాస్‌ ధుల్, సత్యేంద్రకు బెయిల్‌ మంజూరు చేయలేదు. కోర్టు సత్యేంద్ర బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడం ఇది రెండోసారి.

Next Story