'శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా': అరుదైన గౌరవం ఇచ్చిన గూగుల్.. ఎవరికో తెలుసా..?
Satellite Man Of India Google Today Doodle. గూగుల్ టూడే డూడుల్ 'శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా' పిలువబడే ప్రసిద్ద భారత ప్రొఫెస్, శాస్త్రవేత్త ఉడిపి రామచంద్రరావు 89వ పుట్టిన రోజు
By Medi Samrat Published on 10 March 2021 12:12 PM IST
గూగుల్ టూడే డూడుల్ 'శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా' పిలువబడే ప్రసిద్ద భారత ప్రొఫెస్, శాస్త్రవేత్త ఉడిపి రామచంద్రరావు 89వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ప్రొఫెసర్ 2017లో మరణించారు. అతను అంతరిక్ష శాస్త్రవేత్త అలాగే భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ISRO) అధ్యక్షుడు. 1932లో కర్ణాటకలోని మారుమూల గ్రామంలో జన్మించిన ప్రొఫెసర్ రామచంద్ర రావు.. భౌతిక శాస్త్రవేత్తగా చేశాడు. అంతేకాదు భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా పరిగణించబడే డాక్టర్ విక్రమ్ సారాభాయ్లతో కలిసి తన వృత్తిని ప్రారంభించాడు. అయితే డాక్టరేట్ పూర్తి చేసిన తర్వాత ప్రొఫెసర్ రాచమంద్రరావు యూఎస్ వెళ్లి అక్కడ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆ తర్వాత నాసా యొక్క పయనీర్ ఎక్స్‌ప్లోరర్ స్పేస్ ప్రోబ్‌పై ప్రయోగాలు చేశారు. గూగుల్ డూడుల్ ఈ రోజు భూమి, నక్షత్రాల నేపథ్యంలో ప్రొఫెసర్‌రావు యొక్క స్కెచ్‌ను చూపించారు.
ప్రొఫెసర్ రావు 1966లో భారతదేశానికి తిరిగి వచ్చి 1972లో తన దేశం యొక్క ఉపగ్ర కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి తీవ్రంగా శ్రమించారు. ఖగోళ శాస్త్రానికి భారతదేశపు ప్రధాన సంస్థ ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో హై ఎనర్జీ ఖగోళ శాస్త్ర కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. 1975లో భారత మొట్టమొదటి ఉపగ్రహం 'ఆర్యభట్ట' ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఉపగ్రహం నుంచి కమ్యూనికేషన్, వాతావరణ సమాచారం అందుకోవడం ప్రారంభించింది. ఇది దేశానికి ముఖ్యంగా గ్రామీణ భారతదేశానికి ఎంతోగానో సహాయపడింది. గూగుల్ ప్రకారం.. 1984 నుంచి 1994 వరకు ప్రొఫెసర్ రామచంద్ర రావు తన దేశం అంతరిక్ష కార్యక్రమాన్ని ఎత్తులకు పెంచడానికి ఇస్రో చైర్మన్‌గా పని చేశారు. ఇవే కాకుండా ప్రొఫెసర్ 250కిపైగా ఉపగ్రహాలను ప్రయోగించి పీఎస్‌ఎల్‌వీ లాంటి రాకెట్ టెక్నాలజీని ఎంతగానో అభివృద్ధి చేశారు. 2013లో శాటిలైట్ ఆఫ్ ఫేమ్‌లో ప్రవేశించిన మొదటి భారతీయుడుగా నిలిచారు. అదే ఏడాది పీఎస్‌ఎల్వీ భారతదేశం మొట్టమొదటి ఇంటర్ల్పానెటరీ మిషన్ 'మంగల్యాన్'ను ప్రారంభించారు. ఇది ఇప్పటికీ అంగారక గ్రహం చుట్టూ తిరుగుతోంది.