బీజేపీని ఢీ కొట్టేందుకు డింపుల్ యాదవ్‌ను రంగంలోకి దింపిన ఎస్పీ
Samajwadi Party fields Dimple Yadav in bid to fend off BJP challenge. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఉత్తరప్రదేశ్‌లోని
By Medi Samrat Published on 13 Nov 2022 3:37 PM ISTసమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌ను పోటీకి దింపింది. మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ములాయం కుటుంబ కంచుకోట. మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఐదు స్థానాల్లో ఎస్పీకి చెందిన ఇద్దరు అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
మాజీ ఎమ్మెల్సీ సుభాష్ చంద్ర యాదవ్ మాట్లాడుతూ.. సమాజ్ వాదీ పార్టీ విలువలను అనుసరించి, డింపుల్ యాదవ్ ఈ ప్రాంతంలో పెద్ద విజయం సాధిస్తారని అన్నారు. మెయిన్‌పురి యువత, ప్రజలు ఎల్లప్పుడూ నేతాజీ వెంటే ఉన్నారని, కాబట్టి డింపుల్ యాదవ్ కోడలిగానే కాకుండా అభ్యర్థిగా కూడా గెలుస్తారని, ఈసారి బీజేపీ సవాల్‌లో ఉందని ఆయన అన్నారు. మరోవైపు మెయిన్‌పురి మాజీ ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ నేతాజీకి అండగా ఉంటారని, ఈసారి డింపుల్ యాదవ్‌కు పూర్తి మద్దతు లభిస్తుందని అన్నారు.
"ప్రతి ఎన్నికలలో బిజెపి పరిపాలనా యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది. మెయిన్‌పురిలో SP కార్యకర్తలు, ప్రతినిధులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. అయితే SP సాంప్రదాయ స్థానాన్ని షేక్ చేయడంలో ఈ జిమ్మిక్కులు ఏవీ విజయవంతం కావు" అని ఆయన అన్నారు. మెయిన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు కూడా ఈ ఎన్నికలను నేతాజీ ఎన్నికగా అభివర్ణించారు. సైఫాయి [ములాయం సింగ్ యాదవ్ పూర్వీకుల గ్రామం] ప్రజలు యాదవ్ కుటుంబంలోని ఎవరైనా ఈ స్థానం నుండి పోటీ చేయవచ్చని చెప్పారు.
ఇదిలా ఉంటే బీజేపీ ఎస్పీకి సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. మంత్రి, మైన్‌పురి సదర్ ఎమ్మెల్యే జైవీర్ సింగ్ మాట్లాడుతూ.. నేతాజీ శకం ముగిసిందని, మెయిన్‌పురి ప్రజలు బీజేపీ గెలుపు కోసం ఆసక్తిగా ఉన్నారన్నారు. కుటుంబ రాజకీయాలను తిరస్కరిస్తూ మెయిన్‌పురిలో కూడా బీజేపీ అభివృద్ధి, సుపరిపాలనపై ప్రజలు ఓట్లు వేస్తారని ఆయన అన్నారు.