ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీ ఖాన్
ప్రాణాంతక దాడి జరిగిన 5 రోజుల తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఈరోజు లీలావతి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.
By Medi Samrat Published on 21 Jan 2025 3:08 PM ISTప్రాణాంతక దాడి జరిగిన 5 రోజుల తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఈరోజు లీలావతి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల సైఫ్, కరీనా కపూర్‌ల ఇంట్లోకి ఓ దొంగ అర్థరాత్రి ప్రవేశించాడు. దొంగతో జరిగిన గొడవలో సైఫ్ గాయపడ్డాడు. ఆగంతకుడు సైఫ్‌ను కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత సైఫ్‌కు ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. సైఫ్ ప్రస్తుతం కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు.
ఐదు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ క్రమంగా కోలుకుంటున్నాడు. సైఫ్ పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు ఆయనను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. కరీనా కపూర్ ఖాన్ తన భర్త సైఫ్‌ను తీసుకెళ్లేందుకు ఆసుపత్రికి చేరుకుంది. దీంతో సైఫ్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే సైఫ్ తన పాత ఇంటికి వెళ్లాడు. సైఫ్, కరీనా గతంలో ఫార్చ్యూన్ హైట్స్ భవనంలో నివసించారు.
సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్ననే థానేలో అతడిని అరెస్టు చేశారు. నిందితుడు బంగ్లాదేశ్ నివాసి అని, రెజ్లింగ్ ప్లేయర్ అని పోలీసులు చెబుతున్నారు. అతడు 5-6 నెలల క్రితం భారత్‌కు వచ్చి ముంబైలో నివసిస్తున్నాడు. ముంబైలో విజయ్ దాస్‌గా నివసిస్తున్న అతని పేరు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం. ముంబైలోని ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు.