సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్‌ను కొట్టిన పోలీసులు

Sachin's fan Sudhir was kicked away by the police. సచిన్ టెండూల్కర్‌ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరిని బీహార్‌లోని

By M.S.R  Published on  22 Jan 2022 2:01 PM IST
సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్‌ను కొట్టిన పోలీసులు

సచిన్ టెండూల్కర్‌ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరిని బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో టౌన్ పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ గురువారం రాత్రి కొట్టినట్లు సమాచారం. అతని సోదరుడు కిషన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విని సుధీర్ కుమార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే అక్కడ పోలీసు అధికారి సుధీర్ ను కొట్టారని ఆరోపించారు.

"నా సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే విషయం తెలియగానే, దాని గురించి ఆరా తీయడానికి నేను అక్కడికి వెళ్లాను. లాకప్‌లో ఉన్న మా అన్నతో మాట్లాడుతుండగా, డ్యూటీ ఆఫీసర్ వచ్చి నన్ను దుర్భాషలాడాడు. అతను నన్ను రెండుసార్లు తన్నాడు. కాలు వేసి నన్ను పోలీస్ స్టేషన్ వదిలి వెళ్ళమని ఆదేశించాడు. అతను నన్ను, నా సోదరుడిని బూతులు తిట్టాడు" అని సుధీర్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ సంఘటన తర్వాత ఏరియా SDPO రామ్ నరేష్ పాశ్వాన్‌ మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ జరుపుతామని అన్నారు.

రెండేళ్ల క్రితం ఇదే ముజఫర్‌పూర్‌ పోలీసులు పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించారని సుధీర్‌ కుమార్‌ దృష్టికి తెచ్చారు. "అప్పట్లో వాళ్లు నన్ను సెలబ్రిటీలా చూసుకున్నారు.. నేను ప్రారంభించిన అదే పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు నన్ను అవమానించడమే కాకుండా కొట్టడం చాలా బాధగా ఉంది. ఇది సామాన్యుడి పట్ల పోలీసుల వైఖరిని తెలియజేస్తోంది" అని సుధీర్ తెలిపారు. భూమి విక్రయం కేసులో సుధీర్ సోదరుడు క్రిషన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాస్పద స్థల ఒప్పందానికి సంబంధించి అతను ప్రత్యక్ష సాక్షి అని పోలీసులు తెలిపారు.


Next Story