14 గంటలు ఆర్‌టీజీఎస్ సేవలు బంద్.. ఎప్పుడంటే..
RTGS Services Won't Be Available For 14 Hours on Sunday. ఆర్‌టీజీఎస్ వ్యవస్థ అప్గ్రేడ్ వల్ల 14 గంటలపాటు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది.
By Medi Samrat Published on
16 April 2021 3:35 AM GMT

దేశ వ్యాప్తంగా నగదు బదిలీ సేవలకు 14గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. తక్షణ నగదు బదిలీ వ్యవస్థ 'రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్' (ఆర్‌టీజీఎస్) సేవలకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ మేరకు ఈ శనివారం (ఏప్రిల్ 17) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం (ఏప్రిల్ 18) మధ్యాహ్నం 2 గంటల వరకు.. 14 గంటలపాటు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది.
ఆర్‌టీజీఎస్ వ్యవస్థ అప్గ్రేడ్ వల్ల ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు ఆర్‌బీఐ వివరించింది. ముఖ్యంగా డిజాస్టర్ రికవరీ టైమ్‌ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఆర్‌టీజీఎస్ సేవలకు అంతరాయం ఏర్పడినా.. నెఫ్ట్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది ఆర్‌బీఐ. ఇదిలావుంటే.. 2020 డిసెంబర్ 14 నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు 24 గంటలు అందుబాటులోకి వచ్చాయి.
Next Story