సజ్జనార్ ట్వీట్ పై స్పందించిన ప్రధాని మోదీ

డిజిటల్ ఫ్రాడ్‌పై 'సీనియర్ ఐపీఎస్ అధికారి, టిజిఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించింది.

By Kalasani Durgapraveen  Published on  27 Oct 2024 10:15 AM GMT
సజ్జనార్ ట్వీట్ పై స్పందించిన ప్రధాని మోదీ

డిజిటల్ ఫ్రాడ్‌పై 'సీనియర్ ఐపీఎస్ అధికారి, టిజిఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించింది. ఆదివారం మన్ కీ బాత్ ఎపిసోడ్ సందర్భంగా, ప్రధాని మోదీ డిజిటల్ మోసాలపై చర్చించారు. ఒక వ్యక్తి నకిలీ పోలీసు అధికారులతో మాట్లాడుతున్న వీడియోను పంచుకున్నారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఈ వ్యక్తి తెలివిగా ఎలా తప్పించుకున్నాడో హైలైట్ చేశారు.

నేటి మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో డిజిట‌ల్ అరెస్ట్ పై సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పంచుకున్నారు. క‌ర్ణాట‌క విజ‌య‌పురకు చెందిన సందీప్ పాటిల్ అనే వ్య‌క్తి.. న‌కిలీ పోలీస్ తో చేసిన సంభాష‌ణకు సంబంధించిన వీడియోను సెప్టెంబ‌ర్ 19న పోస్ట్ చేశారు స‌జ్జ‌నార్. సైబ‌ర్ నేరాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో భాగంగా చేసిన ఆ ట్వీట్‌ను ఆధారంగా తీసుకుని సందీప్ పాటిల్‌ను గుర్తించింది హోంశాఖ, పీఎంవో, మ‌న్ కీ బాత్ కార్య‌క్రమంలో సంతోష్ పాటిల్ ధైర్యాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మొచ్చుకున్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాల నియంత్రణకు అవగాహన కల్పించేందుకు ఈ విషయాన్ని ప్ర‌స్తావించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు స‌జ్జ‌నార్‌.


Next Story