ఈ దేశాల నుంచి వ‌చ్చేవారికి ఆర్టీ పీసీఆర్ ప‌రీక్ష‌ త‌ప్ప‌నిస‌రి

RT-PCR test mandatory for foreign arrivals from China and 4 other nations.చైనా, జపాన్‌, ద‌క్షిణ కొరియా, హాంగ్ కాంగ్‌,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2022 8:01 AM GMT
ఈ దేశాల నుంచి వ‌చ్చేవారికి ఆర్టీ పీసీఆర్ ప‌రీక్ష‌ త‌ప్ప‌నిస‌రి

ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రోసారి క‌రోనా త‌న పంజా విసురుతోంది. చైనాలో బీఎఫ్ 7 వేరియంట్ విజృంభిస్తోంది. ఫ‌లితంగా అక్క‌డ రోజు ల‌క్ష‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తారు. చైనాతో పాటు అమెరికా, జ‌పాన్ వంటి దేశాల‌ల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌కు జారీ చేసింది. దేశంలోకి క‌రోనా కొత్త వేరియంట్ రాకుండా అడ్డుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

చైనా, జపాన్‌, ద‌క్షిణ కొరియా, హాంగ్ కాంగ్‌, థాయిలాండ్ దేశాల నుంచి వ‌స్తున్న ప్ర‌యాణికులకు RT-PCR పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం శనివారం ప్రకటించింది.

"చైనా, జపాన్‌, ద‌క్షిణ కొరియా, హాంగ్ కాంగ్‌, థాయిలాండ్ దేశాల నుంచి ప్ర‌యాణీకుల‌కు ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు త‌ప్ప‌స‌రి. ఈ దేశాల‌కు చెందిన ప్ర‌యాణీకుల్లో ఎవ‌రికైనా కొవిడ్ లక్ష‌ణాలు ఉన్నా, లేక ప‌రీక్ష‌ల్లో పాజిటివ్‌గా తేలినా, వాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది." అని కేంద్ర మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ అన్నారు.

మెడిక‌ల్ ఆక్సిజ‌న్ స్టాక్‌లో పెట్టుకోండి

మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. క‌రోనా మ‌రోసారి విజృంభించే అవ‌కాశం ఉండ‌డంతో ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌పై ఆరా తీస్తోంది. ప్రతివారం ఆక్సిజన్ లభ్యతపై సమీక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం తెలిపింది. ఆస్పత్రుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించింది. అవసరాలకు తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లతో పాటు బ్యాకప్ స్టాక్ కూడా ఏర్పాటు చేసుకోవాలని, లైఫ్ సపోర్ట్ పరికరాలైన వెంటిలేటర్లు, బైపాప్ యంత్రాలు, SpO2 సిస్టమ్స్ తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలంది. కేంద్ర ఆరోగ్య శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ మ‌నోహ‌ర్ ఈ మేర‌కు అన్ని రాష్ట్రాల‌కు లేఖను రాశారు.

Next Story