కులం భేదాలను అంతం చేయాలి, ఆ 'మూడు' చాలు..RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik
Published on : 20 April 2025 6:55 PM IST

National News, RSS Chief Mohan Bhagwat, Caste, Hindu Community

కులం భేదాలను అంతం చేయాలి, ఆ 'మూడు' చాలు..RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని హిందూ సమాజంలో కుల భేదాలు ఇక తొలగించాల్సిన సమయం వచ్చిందని, అందరూ సమానులని పరిగణించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. “ఒక దేవాలయం, ఒక బావి, ఒక స్మశానం” అనే నినాదాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలీఘర్‌లో ఐదు రోజుల పర్యటన సందర్భంగా, భగవత్ రెండు శాఖలలో స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులం ద్వారా విడదీసే ఆచారాలు హిందూ సమాజానికి హానికరం. హిందూ సమాజం ఒకటిగా ఉండాలి. మనమంతా భిన్నమైన కుటుంబాల నుంచి వచ్చినా మన మూలం ఒకటే. కులాల ఆధారంగా మనల్ని మనమే విడదీయడం వల్ల హిందూ సమాజం బలహీనపడుతోంది. ఇది వలస పాలకులు పోషించిన వ్యూహం, కానీ ఇప్పుడు మనమే అదే వ్యవస్థను కొనసాగిస్తున్నాం అని విమర్శించారు.

హిందువులందరికీ ఒకే రకమైన హక్కులు ఉండాలి. దేవాలయానికి ఎవరు వస్తారో చూసే హక్కు మనకెవ్వరికి లేదు. బావి నీళ్లపై హక్కు, స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించే హక్కు .. ఇవన్నీ అందరికీ సమానంగా ఉండాలి. కులం పేరుతో వీటిని వేరుచేయడం తప్పు” అని భగవత్ పేర్కొన్నారు. కేవలం మాటలకే కాకుండా, ఆచరణలో కూడా ఈ మార్పులు రావాలని కోరారు. మన మనసుల్లో మార్పు రావాలి. ఒకరి పట్ల హీనంగా చూసే దృక్పథం మారాలి. మనం ఒక్కటే అనే భావనను ప్రతి ఒక్కరూ పెంపొందించాలి. హిందూత్వం అంటే భిన్నతల్లో ఏకత్వం – అది అందరికీ వర్తించేది” అని వివరించారు.

Next Story