వ్యాపారి ఇంట్లో భారీగా నగదు కట్టలు.. లెక్కబెట్టడానికి 14 గంటల సమయం

RS.100 crore benami property seized in I-T raids in Maharashtra's Jalna. మహారాష్ట్రలోని జల్నాలో ఇద్దరు వ్యాపారులకు సంబంధించి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ రైడ్స్‌ చేసింది. ఈ దాడుల్లో భారీగా

By అంజి  Published on  11 Aug 2022 3:44 PM IST
వ్యాపారి ఇంట్లో భారీగా నగదు కట్టలు.. లెక్కబెట్టడానికి 14 గంటల సమయం

మహారాష్ట్రలోని జల్నాలో ఓ వ్యాపారికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ రైడ్స్‌ చేసింది. ఈ దాడుల్లో భారీగా బినామీ ఆస్తులను అధికారులు గుర్తించారు. సుమారు రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది. స్టీల్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలతో అక్రమాలకు పాల్పడినట్లు, ఆ డబ్బుతోనే ఈ ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.56 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, డైమండ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాలు, బ్యాంక్‌ డిపాజిట్‌లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను కూడా జప్తు చేశారు.

ఆగస్టు 1 నుంచి 8 మధ్యలో ఈ ఐటీ దాడులు జరిగాయి. జల్నాలోని ఓ సంస్థ.. పన్ను ఎగవేతకు పాల్పడిందన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు.. ఈ సోదాలు చేపట్టారు. జల్నాలోని నాలుగు భారీ స్టీల్​ మిల్లులు పన్ను కట్టకుండా పంగనామం పెట్టాయి. సంస్థ కార్యకలాపాల్లో వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి చూపించకుండా అక్రమాలకు పాల్పడ్డాయి. నాసిక్​లోని ఐటీ శాఖ అధికారులు.. స్థానిక యంత్రాంగంతో కలిసి.. స్టీల్​ సంస్థ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల నివాసాలు, వ్యాపారుల ఇళ్లల్లో దాడులు నిర్వహించింది. ఏకకాలంలో ఐదు వేరువేరు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. నగదును లెక్కపెట్టడానికే అధికారులకు 14 గంటల సమయం పట్టడం గమనార్హం.

Next Story