నో పార్కింగ్ లో వాహనం ఉంటే ఫోటో తీసి డబ్బు సంపాదించుకోండి

RS 500 Reward For Pictures Of Wrongly Parked Vehicles? Nitin Gadkari Speaks Of "New Law Soon".రోడ్డుపై వెళ్తుండగా నో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2022 11:24 AM IST
నో పార్కింగ్ లో వాహనం ఉంటే ఫోటో తీసి డబ్బు సంపాదించుకోండి

రోడ్డుపై వెళ్తుండగా నో పార్కింగ్ స్థలంలో వాహనం కనిపిస్తే వెంటనే ఫొటో తీసి పంపిస్తే నజరానా మీ సొంతమవుతుంది. నో పార్కింగ్‌ ను అడ్డుకోడానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఓ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. రాంగ్ పార్కింగ్ వాహనాలను ఫొటోలు తీసి అధికారులకు పంపిస్తే.. ఆ వాహనానికి విధించే జరిమానాలో సగాన్ని ఫొటో పంపిన వ్యక్తికి ఇవ్వనున్నట్టు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫొటోలను పంపించే వ్యక్తులకు బహుమానం ఇవ్వడాన్ని చట్టంలోనూ పొందుపరుస్తామన్నారు. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఇళ్ల వద్ద వాహన పార్కింగ్‌కు స్థలాన్ని కేటాయించకుండా రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో తన కుక్‌కు రెండు సెకండ్ హ్యాండ్ వాహనాలు ఉన్నాయని, నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న వారికి ఆరు వాహనాలు ఉంటున్నాయన్నారు.

ప్రధాన పట్టణాల్లో రాంగ్ పార్కింగ్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త స్కీంను అమల్లో తెచ్చేందుకు సిద్ధమవుతోందన్నారు. వాహనదారుడికి రూ. వెయ్యి జరిమానా పడటంతో పాటు, ఫోటో తీసి పంపించిన వ్యక్తికి రూ. 500 తన అకౌంట్ లో జమ అవుతాయి. ఈ తరహాలో కొత్త స్కీంను అమల్లోకి తెచ్చేందుకు ఓ చట్టంను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు, అప్పుడే రాంగ్ పార్కింగ్ కు చెక్ పెట్టొచ్చని గడ్కరీ తెలిపారు.

Next Story