బ్లాక్ మార్కెట్ లో రెమ్‌డెసివీర్
Remdisivir being sold in the black market.కొవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు వినియోగించే రెమ్‌డెసివీర్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ఓ మెడికల్ షాప్ యజమాని.
By Medi Samrat Published on 16 April 2021 10:33 AM ISTకరోనా ప్రభంజనం ఏమో కానీ దానికి వాడే మందుల పేర్లు అందరికీ నోటికి వచ్చేసాయి. నిద్రలో లేపి అడిగినా మందుల లిస్ట్ చదువేయగలరు. ఇక మందుల ప్రిస్క్రిప్షన్ లు అయితే వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజ్ లుగా మారిపోయాయి. గుడ్ మార్నింగ్ మెసేజ్ లు ఎంత ఎక్కువగా తిరుగుతాయో అంత బాగా అలవాటు అయిపోయాయి. ఆ కోవిడ్ మందులలో రెమ్‌డెసివీర్ ఇంజక్షన్ కూడా ఒకటి..
గతం లో మందుల చీటీ లేకుండా కరోనా మందులు ఇచ్చే వాళ్ళు కాదు.. ఇప్పుడు ఒక్కోటి ఒక్కో దగ్గర కొనుక్కోవచ్చు అనే ఐడియా తో జనం నచ్చిన మందులు ముందే కొనుక్కొని పెట్టేస్తున్నారు. ఏవో నాలుగు యాంటీ బయోటిక్ లు, లో పారాసిటమోల్ వరకూ అయితే పర్వాలేదు. కానీ జనం వేలం వెర్రిగా ఇంజక్షన్ లు కూడా కోనేసుకోవాలనుకోవడం మందుల షాపుల యాజమాన్యం రెచ్చిపోతున్నారు. తాజాగా
కొవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు వినియోగించే రెమ్‌డెసివీర్ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ఓ మెడికల్ షాప్ యజమాని సహా ముగ్గురు వ్యక్తులను మధ్య ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కనీసం ఎంఆర్పీ రేటు కూడా లేకుండా ఉన్న రెండు బ్రాండ్లకు చెందిన 12 ఇంజెక్షన్లను వారి వద్ద స్వాధీనం చేయనుకున్నారు. ఒక్కో ఇంజెక్షన్ రూ.20 వేలకు విక్రయించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
నిజానికి ఊపిరి ఆడని కోవిడ్ రోగులకు.. ఆక్సిజన్ అందని వ్యాధిగ్రస్తులకు మాత్రమే రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్ వాడాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో .. చాలా మంది రోగులకు ఊపిరాడని సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. దీంతో రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్‌కు డిమాండ్ పెరిగింది. ఆ ఇంజెక్షన్లను మితంగా, అవసరాన్ని బట్టి వాడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్లను కేవలం హాస్పిటళ్లకు మాత్రమే సరఫరా చేయాలని, కెమిస్టులు కానీ రోగులకు ఆ ఇంజెక్షన్లను నేరుగా సరఫరా చేయరాదంటూ ఆరోగ్యశాఖ హెచ్చరించింది. హాస్పిటల్‌లో చేరిన రోగుల్లో ఎవరికైతే తక్కువ స్థాయిలో ఆక్సిజన్ అందుతుందో వారికి మాత్రమే ఆ ఇంజెక్షన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఇంటి వాతావరణంలో రెమ్‌డిసివిర్‌ను వాడవద్దు అంటూ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు. దేశవ్యాప్తంగా రెమ్డిసివిర్ ఇంజెక్షన్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ హెచ్చరికలు జారీ చేసింది.