బర్డ్ ఫ్లూ ప్రభావం.. ఎర్ర కోట మీద కూడా..!

Red Fort closed Due to Bird flu. బర్డ్ ఫ్లూ ప్రభావం ఎర్రకోట మీద కూడా పడింది. ఎర్రకోట ప్రాంగణంలో కొన్ని పక్షులు చనిపోగా,వాటిని పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలింది, దీంతో ఈ నెల 26 వరకు ఎర్రకోట మూసేయాలని ప్రకటించారు.

By Medi Samrat  Published on  20 Jan 2021 9:38 AM GMT
Red Fort closed Due to Bird flu

బర్డ్ ఫ్లూ ప్రభావం ఎర్రకోట మీద కూడా పడింది. ఎర్రకోట ప్రాంగణంలో కొన్ని పక్షులు చనిపోగా.. వాటిని పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలింది, దీంతో ఈ నెల 26 వరకు ఎర్రకోట మూసేయాలని నిర్ణయిస్తూ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వేలల్లో పక్షులు చనిపోయాయి. ఎన్నో ప్రాంతాల్లో చికెన్, కోడిగుడ్ల అమ్మకాల మీద నిషేధాన్ని విధించారు. ఇప్పటి వరకు చత్తీస్‌గఢ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్‌లలో బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ఎర్ర కోట ప్రాంతంలో కూడా ఎక్కువగా పక్షులు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడి పక్షుల్లో కూడా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు కనిపించాయి.

జనవరి 10న సుమారు 15 కాకులు ఎర్రకోట ప్రాంగణంలో మృతిచెందగా.. జలంధర్‌లోని లేబరేటరీకి పరీక్షల నిమిత్తం వాటిని పంపించగా ఒక కాకికి బర్డ్‌ఫ్లూ సోకిందని తేలిందని ఢిల్లీ ప్రభుత్వ పశు సంరక్షణ విభాగం డైరెక్టర్‌ రాకేష్‌ సింగ్‌ తెలిపారు. రిపబ్లిక్‌ డే రోజైన ఈ నెల 26 వరకు సందర్శకులను ఎర్రకోట లోపలికి అనుమతించడం లేదని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఒక గూడ్లగూబ మృతదేహం పరీక్షించగా దానికి బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్థారణ అయిందని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఎర్రకోటను మూసివేశారు.

బర్డ్‌ ప్లూ నేపథ్యంలో పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం సరికాదని, ఈ విషయంలో పునరాలోచించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. బర్డ్ ఫ్లూ లేని రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవచ్చని తెలిపింది.




Next Story