ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం సెంట్రల్ ముంబై శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.

By Medi Samrat  Published on  10 Oct 2024 3:45 PM GMT
ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం సెంట్రల్ ముంబై శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ముంబై పోలీసులు గన్ సెల్యూట్ తో టాటాకు నివాళులర్పించారు. వర్లీలోని శ్మశానవాటికలో సవతి సోదరుడు నోయెల్ టాటాతో సహా ఆయన కుటుంబ సభ్యులు, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ హాజరయ్యారు. అంత్యక్రియల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మంత్రి పీయూష్ గోయల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే తదితరులు పాల్గొన్నారు.

ముంబయిలోని ఎన్సీపీఏ నుంచి వర్లి శ్మశాన వాటిక వరకు ఈ సాయంత్రం ఆయన అంతిమయాత్ర ఘనంగా సాగింది. పార్సీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల అనంతరం దక్షిణ ముంబైలోని కోల్బాలోని దివంగత పారిశ్రామికవేత్త బంగ్లాలో మరో మూడు రోజుల పాటు కర్మకాండ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Next Story