'నేను చనిపోతా.. అనుమతివ్వండి'.. రాష్ట్రపతికి అత్యాచార బాధితురాలు లేఖ
Rape survivor seeks President Murmu’s permission for euthanasia. నెలల తరబడి తన సవతి కొడుకుతో పాటు తన భర్త స్నేహితుల చేతిలో అత్యాచారానికి గురైన ఓ మహిళ 'అనాయాస మరణానికి
By అంజి Published on 23 Oct 2022 12:09 PM ISTనెలల తరబడి తన సవతి కొడుకుతో పాటు తన భర్త స్నేహితుల చేతిలో అత్యాచారానికి గురైన ఓ మహిళ 'అనాయాస మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసింది. 30 ఏళ్ల మహిళ తనకు న్యాయం జరుగుతుందనే ఆశ పూర్తిగా చనిపోయిందని రాసింది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా అక్టోబర్ 9న పురాన్‌పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా తనపై లైంగిక దాడి చేసిన నిందితులను ఎవరినీ అరెస్టు చేయలేదని ఆమె తన లేఖలో పేర్కొంది.
వారి నుంచి తనకు తరచూ చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, తనపై జరిగిన అఘాయిత్యం గురించి మౌనంగా ఉండాలంటున్నారని చెప్పింది. ''నేను చాలా కష్టపడ్డాను. నాకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదు. కాబట్టి, మీ (అధ్యక్షుడి) అనుమతితో నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను''అని ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు పంపిన లేఖలో రాసింది. బాధిత మహిళ చండీగఢ్‌కు చెందిన 55 ఏళ్ల రైతును, విడాకులు తీసుకున్న వ్యక్తిని కూడా వివాహం చేసుకుంది.
తన సవతి కొడుకు అక్రమ సంబంధం కోసం ఏప్రిల్‌లో తనను సంప్రదించాడని, అప్పటి నుండి తనపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది. సవతి కొడుకు ఆమెను పలు రకాలుగా బెదిరించాడు. తాను గర్భవతి అయినప్పుడు డీఏన్‌ఏ పరీక్ష కోసం వెళ్లాలనుకున్నప్పుడు కనికరం లేకుండా తన కడుపులో కొట్టినట్లు ఆమె పేర్కొంది. అనంతరం పురాన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బలవంతంగా అబార్షన్ చేయించారని చెప్పింది.
జులై 18న తనను తన భర్త స్నేహితుని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారని, అక్కడ అతని బంధువుల్లో ఒకరు, ఇద్దరు సహోద్యోగులు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పేర్కొంది. స్థానిక పోలీసులకు, ఇతర ఉన్నతాధికారులకు ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసింది. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎటువంటి మార్గం లేకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీసులను ఆదేశించింది.
పురాన్‌పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇటీవలే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆమె భర్త, సవతి కొడుకుతో సహా ఐదుగురు పురుషులపై IPC సెక్షన్లు 376-D (గ్యాంగ్-రేప్), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 ( నేరపూరిత బెదిరింపు). కానీ అరెస్టులు మాత్రం జరగలేదు. ఆ మహిళ ప్రస్తుతం తన తల్లి, సోదరుడు, ఆరేళ్ల కొడుకుతో కలిసి బరేలీలో నివసిస్తోంది. పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ ప్రభు మాట్లాడుతూ.. ''ఇది వాస్తవాలు, సాక్ష్యాలతో కూడిన సంక్లిష్టమైన కేసు. న్యాయమైన విచారణ జరుపుతున్నామని, త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం.'' అని చెప్పారు.