వారు ఠాక్రే పేరును దొంగిలించలేరు : ఉద్ధవ్ ఠాక్రే

Ram's dhanush can't be held by Ravana, says Uddhav Thackeray amid 'real' Sena fight. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ‌సేన‌ వర్గానికి ఎన్నికల సంఘం

By Medi Samrat  Published on  20 Feb 2023 9:53 AM GMT
వారు ఠాక్రే పేరును దొంగిలించలేరు : ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ‌సేన‌ వర్గానికి ఎన్నికల సంఘం పార్టీ పేరు, గుర్తును కేటాయించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా ఈసీ, బీజేపీ, షిండేల‌పై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. రాముడి ధనస్సును రావణుడు పట్టుకోలేడని అన్నారు. పార్టీ పేరు, చిహ్నం దొంగిలించబడ్డాయి.. కానీ వారు ఠాక్రే పేరును దొంగిలించలేరు. బాలాసాహెబ్‌కు కొడుకుగా పుట్టే అదృష్టం వారికి లేదు అని ఉద్ధవ్ అన్నారు.. షిండే బృందాన్ని దొంగలుగా అభివ‌ర్ణించారు.

పార్టీ పేరు, గుర్తు నేరుగా ఒక వర్గానికి ఇచ్చిన సందర్భం ఒక్కటి కూడా లేదని పునరుద్ఘాటించిన ఉద్ధవ్.. ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని అన్నారు. ఎన్నికల సంఘం పార్టీ పేరును, గుర్తును తొలగించిన నేప‌థ్యంలో ఉద్ధవ్ ఠాక్రే.. ఫిబ్రవరి 28 వరకు తమ వర్గం జ్యోతి గుర్తును ఉపయోగిస్తారని చెప్పారు. పార్టీ పేరు, గుర్తును లాక్కోవడం శివసేనను అంతమొందించేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయానికి వ్యతిరేకంగా మేం సుప్రీంకోర్టును ఆశ్రయించామని, రేపు విచారణ ప్రారంభం కానుందని తెలిపారు.


Next Story