రాజ్యసభ ఎన్నికలకు నగరా మోగింది. 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న ఆయా రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు.
ఇందులో ఏపీలోని మూడు స్థానాలు, తెలంగాణలో మూడు, కర్ణాటకలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు మహారాష్ట్ర, బీఆర్ఎస్ రాష్ట్రాల్లో ఆరు చొప్పున రాజ్యసభ స్థానాలు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో 5 చొప్పున రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ ఎంపీలు రిటైర్ అవుతున్నారు. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, సంతోష్ ఎంపీలు రిటైర్ కానున్నారు. ఏప్రిల్ 4 తో పదవీకాలం ముగియనుంది.