ప్ర‌చారంలో 'పుష్ప' డైలాగ్‌తో హోరెత్తించిన రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh brings up Allu Arjun's 'Pushpa' in a filmy jibe at Congress. "హమారా పుష్కర్ ఫ్లవర్ భీ హై ఔర్ ఫైర్ భీ" (మా పుష్కర్ పువ్వు మాత్రమే కాదు ఫైర్ కూడా)

By Medi Samrat  Published on  9 Feb 2022 12:50 PM IST
ప్ర‌చారంలో పుష్ప డైలాగ్‌తో హోరెత్తించిన రాజ్‌నాథ్ సింగ్

"హమారా పుష్కర్ ఫ్లవర్ భీ హై ఔర్ ఫైర్ భీ" (మా పుష్కర్ పువ్వు మాత్రమే కాదు ఫైర్ కూడా) అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని తేలికగా తీసుకోవద్దని బీజేపీ సీనియర్ నాయకుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఒక సమావేశంలో ప్రజలను ఉద్దేశించి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, పుష్కర్ ధామికి సాధారణ, సున్నితమైన స్వభావం ఉన్నప్పటికీ ఎవరికీ తలవంచడని అన్నారు. 'పుష్ప' సినిమా గురించి ప్రస్తావిస్తూ రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ 'పుష్ప' సినిమాను ప్రస్తావించారు. ఈ సినిమాకు, సీఎం పుష్కర్ కు మధ్య పోలిక తీసుకొచ్చారు. ఉత్తరాఖండ్ లో కూడా ఒక పుష్ప (సీఎం పుష్కర్ థామి) ఉన్నారని అన్నారు. ఈయన చాలా సౌమ్యంగా, సింపుల్ గా ఉంటారని ఈయనలో కూడా ఫ్లవర్ ఉంది, ఫైర్ ఉందని చెప్పారు. పుష్కర్ ను ఎవరూ ఆపలేరని అన్నారు. ఉత్తరాఖండ్‌లోని గంగోలిహాట్‌లో జరిగిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ పుష్ప సినిమా డైలాగ్‌ను సీఎం పుష్కర్ సింగ్ ధామికి అన్వయించారు. మన ముఖ్యమంత్రి పేరు పుష్కర్ అని, అయితే ఈ పుష్కర్ పేరు వింటేనే పువ్వు అని కాంగ్రెస్ కు అర్థమవుతోందని, ఈ పుష్కర్ ఒక పువ్వు మాత్రమే కాదు అగ్ని కూడా అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మా పుష్కర్ ఎప్పటికీ తలవంచడు, ఆగడని అన్నారు.


Next Story