ప‌ట్టాలు త‌ప్పిన రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌

Rajdhani Express Derails In Maharashtra Tunnel.మ‌హారాష్ట్ర‌లో రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2021 10:09 AM IST
ప‌ట్టాలు త‌ప్పిన రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌

మ‌హారాష్ట్ర‌లో రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. శ‌నివారం తెల్ల‌వారుజామున ర‌త్న‌గిరి స‌మీపంలోని సొరంగంలో రైలు ప‌ట్టాలు త‌ప్పింది. అయితే.. అదృష్ట వ‌శాత్తు ఈ ప్ర‌మాదంలో ప్ర‌యాణీకులు ఎవ్వ‌రికి ఎటువంటి గాయాలు కాక‌పోవ‌డంతో అధికారులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. రైలు ఢిల్లీ హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ నుంచి గోవా మ‌డ్గావ్ వైపు వెలుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ ప్ర‌మాదంతో ఆ మార్గంలో రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ముంబై నుంచి 325 కిలోమీటర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రైల్వే అధికారులు హుటాహటిన సంఘటన స్థలానికి బయలుదేరారు.

Next Story