'ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ'.. పెళ్లి కోసం అబ్బాయిగా మారిన యువతి.. ట్విస్ట్ ఇదే.!
Rajasthan teacher undergoes gender change surgery to marry lover. ఓ యువతి తన ప్రియురాలితో పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలని కలలు కనింది. అందుకోసం ఆ యువతి లింగమార్పిడి
By అంజి Published on 8 Nov 2022 1:35 PM ISTఓ యువతి తన ప్రియురాలితో పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలని కలలు కనింది. అందుకోసం ఆ యువతి లింగమార్పిడి చేసుకుని యువకుడిలా మారింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో తన ప్రియురాలిని చేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జరిగింది. భరత్‌పుర్‌కు చెందిన మీరా కుంతల్ అనే పీటీ టీచర్.. లింగమార్పిడి శస్త్రచికిత్స చేసుకుని అబ్బాయిగా మారింది. అనంతరం తన విద్యార్థిని కల్పనను పెద్దల పర్మిషన్‌తో వివాహాం చేసుకుంది. మీరా నేషనల్ లెవెల్ ఛాంపియన్, విద్యార్థిని కల్పన కూడా కబడ్డీలో మంచి గుర్తింపు పొందిన ప్లేయర్. మీరా లింగమార్పిడిన తర్వాత తన పేరును ఆరవ్‌గా మార్చుకుంది.
జిల్లా పరిధిలోని నాగ్లా మోతి విలేజ్‌లోని గవర్నమెంట్ స్కూల్‌లో మీరా పీటీ టీచర్‌గా పని చేస్తోంది. స్కూల్‌లో అమ్మాయిలకు కబడ్డీ ఆట నేర్పుతూ ఉండేది. ఈ క్రమంలోనే 2016లో మీరా (ఆరవ్), కల్పన మధ్య స్నేహం చిగురించింది. వారు 2 సంవత్సరాలు సన్నిహిత స్నేహితులుగా ఉన్నారు. తర్వాత 2018లో మీరా (ఆరవ్) కల్పనకు పెళ్లికి ప్రపోజ్ చేసింది. దానికి ఆమె వెంటనే అంగీకరించింది. అయితే వారు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. ఇద్దరు మహిళలు వివాహం చేసుకోవడానికి వారి తల్లిదండ్రులు అంగీకరించరు. అందుకే తన లింగాన్ని మగవాడిగా మార్చుకుంటే బాగుంటుందని మీరా భావించింది.
అయితే మీరా అడపిల్లలాగ పుట్టినా.. చిన్నప్పటినుంచి ఆమెకు పురుష లక్షణాలు ఉన్నాయి. చూడటానికి మీరా ఆడపిల్లలా కనిపించినా, పురుషుడిగానే జీవించాలనుకునేదని ఆమె తండ్రి తెలిపారు. దీంతో మీరా ఓ మానసిక వైద్యుడిని సంప్రదించింది. ఆమెకు జెండర్ డిస్ఫోరియా అనే వ్యాధి ఉందని వైద్యుడు నిర్దారించాడు. ఆ తర్వాత లింగ మార్పిడి చేసుకునేందుకు మీరా నిర్ణయించుకుంది. దీనికి మీరా కుటుంబం కూడా ఒప్పుకుంది. అనంతరం 2021 లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని మీరా కాస్తా.. ఆరవ్‌గా మారింది. ఆపరేషన్ టైంలో కల్పన ఆరవ్‌ను దగ్గరుండి చూసుకుంది. అనంతరం కుటుంబ సభ్యుల అనుమతితో 2022 నవంబర్ 4న పెళ్లి చేసుకున్నారు.