పేపర్ లీక్.. పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రద్దు
Rajasthan Police constable exam cancelled after paper leak.పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశ్నపత్రం
By తోట వంశీ కుమార్ Published on
17 May 2022 7:54 AM GMT

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో అధికారులు పరీక్షను రద్దు చేశారు. మే 14న రెండో షిప్టుకు సంబంధించిన ప్రశ్నాపత్రం స్క్రీన్‌షాట్లు పరీక్షకు కొంత సమయం ముందు వాట్సాప్ వైరల్‌గా మారింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేడు(మంగళవారం) ప్రకటించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలను నిర్వహించారు. మే 13 నుంచి 16 వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. కాగా.. మే 14న రెండవ షిప్ట్ సమయంలో జైపూర్‌లోని దివాకర్ పబ్లిక్ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ సమయానికి ముందే పేపర్ కవర్‌ను తెరిచారు. దీంతో ఆ షిప్ట్‌లో జరగాల్సిన పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. పేపర్ లీకేజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Next Story