మరాఠీ మాట్లాడలేదని బ్యాంకు ఉద్యోగిని కొట్టిన ఎంఎన్‌ఎస్ కార్యకర్త

రోజువారీ వ్యాపార లావాదేవీలలో మరాఠీని ఉపయోగించనందుకు లోనావాలాలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఓ బ్యాంకు ఉద్యోగిని కొట్టారు.

By Knakam Karthik
Published on : 3 April 2025 10:03 AM IST

National News, Maharastra, Language Row, Workers Thrash Bank Employee

మరాఠీ మాట్లాడలేదని బ్యాంకు ఉద్యోగిని కొట్టిన ఎంఎన్‌ఎస్ కార్యకర్త

మహారాష్ట్రలో భాషా వివాదం మరోసారి తెరపైకివచ్చింది. రోజువారీ వ్యాపార లావాదేవీలలో మరాఠీని ఉపయోగించనందుకు లోనావాలాలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఓ బ్యాంకు ఉద్యోగిని కొట్టారు. బ్యాంకు లావాదేవీలన్నీ మరాఠీలోనే జరుగాలని రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన డిమాండ్‌ చేసింది. రాష్ట్ర అధికార భాషలోనే బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌, కమ్యూనికేషన్స్‌ జరుగాలని అల్టిమేటమ్‌ జారీ చేసింది. మంగళవారం ఈ మేరకు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎంఎన్‌ఎస్ ‌కార్యకర్తలు ఎస్‌ బ్యాంకును సందర్శించారు. బ్యాంకు సిబ్బందికి పూలతోపాటు రాళ్లను అందజేశారు. బ్యాంకు లావాదేవీలను మరాఠీలో జరుపాలన్న డిమాండ్‌ను పూలతో, అలా జరుగని పక్షంలో తమ చర్య ఇలా ఉంటుందన్న వార్నింగ్‌ను రాయితో సింబాలిక్‌గా తెలియజేశారు. మిగతా జాతీయ, ప్రైవేట్‌ బ్యాంకులను కూడా వారు సందర్శించనున్నారు.

రాజ్ థాకరే నేతృత్వంలోని పార్టీ కార్యకర్తలు లోనావాలాలోని మహారాష్ట్ర బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించి, బ్రాంచ్ మేనేజర్‌కు తమ డిమాండ్‌ను సమర్పించారు, మరుసటి రోజు నుండి అందరు ఉద్యోగులు మరాఠీలో మాట్లాడాలని పట్టుబట్టారు. చర్చ సమయంలో, మరాఠీ మాట్లాడే ఉద్యోగి జోక్యం చేసుకుని, హిందీ వాడకం వల్ల కస్టమర్ సేవ ప్రభావితం కాదని వాదించారు. ఈ ప్రకటన MNS కార్యకర్తలకు కోపం తెప్పించింది, వారు అతనిపై దాడి చేసి మేనేజర్ క్యాబిన్ నుండి బయటకు తోసేశారు.

Next Story