ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఫ్రీగా టికెట్ల తేదీలు మార్పు
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
By - Knakam Karthik |
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఫ్రీగా టికెట్ల తేదీలు మార్పు
ఢిల్లీ: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ట్రైన్ టికెట్ కొనుక్కున్న తర్వాత మళ్ళీ దాన్ని తేదీని మార్చుకునే వీలు లేదు. ప్రయాణ తేదీ మారాలంటే ఆల్రెడీ కొన్న టికెట్ ను క్యాన్సిల్ చేసుకుని.. మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలి. వారి ప్రయాణ తేదీ టైమ్ ఆధారంగా రీఫండ్ వస్తుంది. కానీ ఇది చాలా సార్లు ప్రయాణికులకు అసౌకర్యంగానే ఉంటుంది. మనకు కావాలనుకున్న టైమ్ కు టికెట్లు దొరకకపోవడం.. ఒక్కోసారి రిఫండ్ రాకపోవడం లాంటివి జరుగుతుంటాయి. అదే విమానాల్లో అయితే ఫ్లెక్సిబుల్ టికెట్ బుకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను భారత రైల్వేస్ కూడా తీసుకువస్తోంది.
దీనికి సంబంధించిన రూల్స్ మార్పుకు రైల్వేస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, వచ్చే జనవరి నుంచి ఈ మార్పులు అమల్లోకి రానుంది. జనవరి నుంచి, ప్రయాణికులు తమకు కన్ఫామ్ అయిన రైలు టికెట్ ప్రయాణ తేదీని ఎలాంటి రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అన్యాయమైంది. ప్రయాణికుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని...అందుకే దీనిని మారుస్తున్నామని చెప్పారు. అయితే టికెట్ల మార్పుకు కొన్ని కండిషన్స్ మాత్రం వర్తిస్తాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. కొత్త వ్యవస్థ ద్వారా ప్రయాణికులు తనకు బుక్ అయిన టికెట్ ప్రయాణ తేదీని మార్చుకోచ్చు. అయితే, మార్చుకోవాల్సిన తేదీలో సీట్లు ఖాళీగా ఉంటేనే మార్పు సాధ్యపడుతుంది. కొత్త టికెట్ ధర ఎక్కువైతే, ఆ వ్యత్యాసాన్ని ప్రయాణికుడు భరించాల్సిందే అని చెప్పారు. ప్రస్తుత నిబంధన ప్రకారం, రైలు బయలుదేరడానికి 48 నుంచి 12 గంటల ముందు బుకింగ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ఛార్జీల నుంచి 25 తగ్గించి, మిగిలిన డబ్బు రీఫండ్ చేస్తారు. 12 గంటల నుంచి 4 గంటల ముందు ఛార్జ్ మరింత పెరుగుతుంది. రిజర్వేషన్ చార్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి డబ్బు తిరిగి చెల్లించరు.