ప్రయాణికులతో అనుచిత ప్రవర్తన.. రైల్వే టీటీఈ సస్పెండ్

ఓ మహిళతో సహా ప్రయాణీకులతో అసభ్య ప్రవర్తించాడో రైలు టీటీఈ. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడిని సస్పెండ్‌ చేశారు అధికారులు.

By అంజి  Published on  15 July 2024 12:22 PM IST
Railway TTE, suspended, misbehaving, passengers

ప్రయాణికులతో అనుచిత ప్రవర్తన.. రైల్వే టీటీఈ సస్పెండ్

ఓ మహిళతో సహా ప్రయాణీకులతో అసభ్య ప్రవర్తించాడో రైలు టీటీఈ. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టిటిఈ)ని ఆదివారం సస్పెండ్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నార్త్ ఈస్టర్న్ రైల్వే (NER) లక్నో డివిజన్ ప్రకారం.. టీటీఈ రంజీత్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై రైల్వే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది.

"టీటీఈ అతని దుష్ప్రవర్తన కారణంగా తక్షణమే సస్పెండ్ చేయబడ్డారు. విచారణ తగిన స్థాయిలో జరిగిన తర్వాత తగిన చర్య ప్రారంభించబడుతుంది" అని ఈశాన్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ యొక్క అధికారిక ఎక్స్‌ ఖాతా తెలిపింది. వైరల్ అయిన కొన్ని వీడియోలలో.. 12 సెకన్ల వీడియోలలో ఒకదానిలో, ఒక యువ ప్రయాణికుడితో మాట్లాడుతున్నప్పుడు అతను అకస్మాత్తుగా కోపంగా ఉన్నాడు. తరువాత, అతనిని దుర్భాషలాడడం ప్రారంభించాడు.

లక్నోలోని ఐష్‌బాగ్ స్టేషన్ నుండి మరొక వీడియోలో, ఒక మహిళా ప్రయాణికురాలు తన కష్టాలను పంచుకున్నాడు. టిటిఈ తన టిక్కెట్‌ను తనిఖీ చేసే నెపంతో రూ. 500 లంచం అడిగాడని, ఆమె చెల్లించడానికి నిరాకరించినప్పుడు ఆమెను చెప్పుతో కొట్టాడని పేర్కొంది. తన దగ్గర చెల్లుబాటయ్యే టికెట్ ఉన్నప్పటికీ, తనను ఆపి డబ్బులు అడగడం మొదలుపెట్టాడు.. మా అమ్మ, చెల్లిని దుర్భాషలాడడంతోపాటు రెండు మూడు సార్లు చెప్పుతో కొట్టాడు అని మహిళ చెప్పింది.

Next Story