పట్టాలపై పడిన చిన్నారిని కాపాడి రియల్ హీరో అయ్యాడు.. ఘన సత్కారం

Railway Pointsman Saves Child.పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించి కాపాడిన రైల్వే ఉద్యోగి.

By Medi Samrat  Published on  20 April 2021 11:24 AM GMT
save child

17-04-2021న ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్‌ఫాం వద్ద తల్లితో కలిసి నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి అకస్మాత్తుగా రైల్వే పట్టాలపై పడిపోయింది. అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారి తల్లి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేసింది. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే వేగంగా కదలిలాడు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి ఫ్లాట్‌ ఫారం మీదకు తరలించి.. అంతే వేగంగా తను కూడా పట్టాల పైనుంచి తప్పుకున్నాడు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. షెల్కే సాహసం సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో రియల్ హీరో అనిపించుకున్నాడు.

మయూర్ షెల్కేను సెంట్రల్‌ రైల్వే అధికారులు ఘనంగా సత్కరించారు. కార్యాలయంలో షెల్కేకు ఇరు వైపుల అధికారులు, తోటి సిబ్బంది నిలబడి చప్పట్లతో అతనికి గ్రాండ్‌ వెల్‌కం పలికారు. అనంతరం షెల్కే ధైర్య సాహసాన్ని అభినందిస్తూ 50 వేల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముంబై డివిజనల్ మేనేజర్‌, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. అతడిని సత్కరించిన వీడియోను రైల్వే శాఖ అధికారిక ట్విట్టర్ లో పంచుకుంది.


Next Story
Share it