భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సీఆర్ పీఎఫ్ గురువారం స్పందించింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మార్గదర్శకాల ప్రకారం.. రాహుల్ గాంధీకి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, అయితే అతను 113 సార్లు నిబంధనలను ఉల్లంఘించాడని తెలిపింది. గాంధీ భద్రతలో లోపభూయిష్టంగా కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నకు.. పార్టీ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA)కి రాసిన లేఖకు గాంధీ భద్రతపై సీఆర్పీఎఫ్ స్పందించింది.
సీఆర్పీఎఫ్.. కేంద్ర హోంశాఖకు సమర్పించిన సమాధానంలో, భారత్ జోడో యాత్రతో సహా 2020 నుండి గాంధీ చాలాసార్లు స్థిర భద్రతా సూచనలను ఉల్లంఘించారని పేర్కొంది. సెక్యూరిటీ నిర్లక్ష్యం లేదని తెలిపింది. ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు అధినేత దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొంది. కాంగ్రెస్ యాత్ర ఢిల్లీలో ప్రవేశించడానికి రెండు రోజుల ముందు డిసెంబర్ 22న అన్ని ముందస్తు సెక్యూరిటీ లైజన్ (ఏఎస్ఎల్) నిర్వహించి భద్రతా మార్గదర్శకాలు ఏర్పాటు చేశామని, తగినంత భద్రతా సిబ్బందిని సైతం మోహరించినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది.
భారత్ జోడో యాత్రలో గాంధీకి భద్రత కల్పించాలని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కెసి వేణుగోపాల్ ఇదే విషయమై హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు, అందులో ఆయన ఢిల్లీ యాత్రలో గాంధీ భద్రతలో లోపాలను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యాత్రలో పాల్గొన్న పలువురిని ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రశ్నించింది.