పార్లమెంట్‌కు సైకిల్ పై వచ్చిన రాహుల్‌గాంధీ
Rahul Gandhi to lead oppostion parties' cycle rally to the Parliament.నిత్యం పెరుగుతున్న ఇంధన ధరలతో
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2021 6:33 AM GMTనిత్యం పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో విపక్షాలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాహుల్ సహా ప్రతిపక్ష ఎంపీలు సైకిల్ తొక్కుకుంటూ మంగళవారం పార్లమెంట్ సమావేశాలకు వచ్చారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ కలిసి పోరాడాల్సిన అవసరముందని రాహుల్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన స్వరం వినిపిస్తే, మన స్వరం అంత బలంగా మారుతుందన్నారు.
అంతకుముందు.. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన విపక్ష పార్టీలు ఈ ఉదయం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశానికి హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీ నేతలతో కాన్‌స్టూషన్ క్లబ్‌లో సమావేశం జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్‌పీ, కేరళ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ కాంగ్రెస్, లోకతాంత్రిక్ జనతాదళ్ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా మనం అంతా కలిసి పోరాడాలని రాహుల్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన స్వరం వినిపిస్తే, మన స్వరం అంత బలంగా మారుతుందని కాంగ్రెస్ నేత తెలిపారు. విపక్ష పార్టీ నేతలతో బ్రేక్‌ఫాస్ట్ ముగిసిన తర్వాత.. రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు సైకిల్ యాత్ర చేపట్టారు.