వీర్ సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్య‌లు.. 44 ఏళ్ల నాటి లేఖ‌తో కేంద్ర‌మంత్రి కౌంట‌ర్‌

ఈరోజు పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ చేశారు.

By Medi Samrat  Published on  14 Dec 2024 12:38 PM GMT
వీర్ సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్య‌లు.. 44 ఏళ్ల నాటి లేఖ‌తో కేంద్ర‌మంత్రి కౌంట‌ర్‌

ఈరోజు పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ చేశారు. వీర్ సావర్కర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మన రాజ్యాంగంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారని.. అందులో భారతీయత ఏమీ లేదని రాహుల్ అన్నారు. సావర్కర్‌ను బీజేపీ ఆదర్శంగా భావిస్తే.. ఆయ‌న లేనెత్తిన అంశాన్ని కూడా తన ప్రకటనగా భావిస్తుందా అని రాహుల్ ప్ర‌శ్నించారు. బీజేపీ నేత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా రాహుల్ వ్యాఖ్య‌ల‌కు బ‌దులిచ్చారు.

అంత‌కుముందు బీజేపీ నేత నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ స్వయంగా వీర్ సావర్కర్‌ను ప్రశంసించారని అన్నారు. దీనిపై రాహుల్ మాట్లాడుతూ.. ఒకసారి నేను మా నాన‌మ్మ‌ ఇందిరాగాంధీని వీర్ సావర్కర్ గురించి అడిగానని.. జైలు నుంచి బయటకు వచ్చేందుకు సావర్కర్ బ్రిటిష్ వారికి క్షమాపణ చెప్పారని చెప్పిన‌ట్లు బ‌దులిచ్చారు.

రాహుల్ ప్రకటన అనంతరం కిరణ్ రిజిజు ట్వీట్ చేస్తూ.. ఈరోజు పార్లమెంటులో రాహుల్ అబద్ధాలు చెప్పారని అన్నారు. 44 ఏళ్ల నాటి ఇందిరా గాంధీ లేఖను కూడా విడుదల చేసిన ఆయన.. లోక్‌సభలో వీర్ సావర్కర్, ఇందిరా గాంధీ గురించి తప్పుడు ప్రకటనలు చేసిన రాహుల్ గాంధీ కోసమే ఈ పత్రం అని అన్నారు. రిజిజు లేఖలో.. ఇందిరా గాంధీ.. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా భారతదేశ వీర‌ కుమారుడిగా అభివర్ణించారు. ఈ లేఖ 1980 సంవత్సరం నాటిది.

భారత రాజ్యాంగంలో అత్యంత నీచమైన విషయం ఏమిటంటే.. అందులో భారతీయత ఏమీ లేదని సావర్కర్ చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. మనుస్మృతితో సావర్కర్ రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నారని రాహుల్ అన్నారు. సావర్కర్ మాటను బీజేపీ సమర్థిస్తుందా అని ఆయన ప్రశ్నించారు.

Next Story