శాంతిభద్రతలతో ఆటలాడితే కఠిన చర్యలు తీసుకుంటాం : రాహుల్‌కు హెచ్చ‌రిక‌

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సంభాల్‌లో పర్యటించనున్న‌ సందర్భంగా ఎక్సైజ్ మంత్రి నితిన్ అగర్వాల్ దీనిని రాజకీయ పర్యటన‌గా పేర్కొన్నారు

By Medi Samrat  Published on  4 Dec 2024 9:50 AM IST
శాంతిభద్రతలతో ఆటలాడితే కఠిన చర్యలు తీసుకుంటాం : రాహుల్‌కు హెచ్చ‌రిక‌

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సంభాల్‌లో పర్యటించనున్న‌ సందర్భంగా ఎక్సైజ్ మంత్రి నితిన్ అగర్వాల్ దీనిని రాజకీయ పర్యటన‌గా పేర్కొన్నారు. సంభాల్‌లో సాధారణ పరిస్థితిని చెడగొట్టాలని కాంగ్రెస్, ఎస్పీ నేతలు చూస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేత జాగ్రత్తగా ఉండాలని ప్రకటించారని, అక్కడికి వెళ్లి తిరిగి శాంతిభద్రతలను చెడగొట్టాలని, అరాచకాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఏ నాయకుడైనా శాంతిభద్రతలతో ఆటలాడుకున్నా, వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించినా మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతలు కేవలం పొలిటికల్ టూరిజం కోసమే వెళతారని నితిన్ అగర్వాల్ అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సంభాల్ జామా మసీదు సర్వే జరుగుతోంది. దీని తర్వాత కూడా ఎస్పీ నాయకులు, కార్యకర్తలు అక్కడ పరిస్థితిని మరింత దిగజార్చడంతో పాటు హింసకు దిగారని ఆరోపించారు. సంభాల్‌లో అధికార యంత్రాంగం అల‌ర్ట్‌గా ఉన్నారని తెలిపారు.

సంభాల్‌లో జరిగిన అల్లర్లలో మరణించిన వ్యక్తులను కలుసుకోవడానికి రాహుల్ గాంధీ బుధవారం సంభాల్‌ను సందర్శించాలని భావిస్తున్నారు. రాహుల్‌ రాక వార్త తెలియగానే పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఈ విషయమై పోలీస్ సూపరింటెండెంట్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. డిసెంబర్ 10 వరకు సంభాల్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై నిషేధం ఉన్నందున జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచామన్నారు.

పది రోజుల క్రితం జామా మసీదులో సర్వే నిర్వహిస్తున్న సందర్భంగా సంభాల్‌లో గొడవ జరిగింది. అక్కడ గుంపులో ఉన్న దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ గొడ‌వ‌లో నలుగురు చనిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై పుకార్లు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఆ ప్రాంతంలోని ఇంటర్నెట్ సిస్టమ్ కూడా బంద్ చేశారు. మరోవైపు నగరంలోకి బయటి వ్యక్తుల రాకపై నిషేధం విధించడంతో పాటు జిల్లా సరిహద్దులను సీల్ చేస్తూ పోలీసు యంత్రాంగం నిఘా పెంచింది.

Next Story